ఈ బుడ్డోడు చేసిన పనికి.. వందల మంది ప్రాణాలు సేఫ్..!

The Work Done By This Kid.. Hundreds Of Lives Are Safe..! , Ten-year-old Boy, West Bengal, Loco Pilot , Malda District, Murcelim, Hole, Railway Tracks, Pothole, Viral News, Latest News, Trending News,

పశ్చిమ బెంగాల్( West Bengal ) రాష్ట్రంలోని మల్దా జిల్లాలోని ఒక పదేళ్ల బాలుడు తన సమయస్ఫూర్తితో వందలాది ప్రాణాలను కాపాడాడు.పట్టాల కింద పెద్ద గుంత ఉన్నట్లు గమనించిన ముర్సెలీమ్ అనే బాలుడు దానిపైన ట్రైన్ వస్తే ప్రమాదం జరుగుతుందేమోనని గ్రహించాడు.

 The Work Done By This Kid.. Hundreds Of Lives Are Safe..! , Ten-year-old Boy, We-TeluguStop.com

సరిగ్గా అదే టైమ్‌లో అదే పట్టాలపై దూసుకు వస్తున్న రైలును చూశాడు.ఆ ట్రైన్ భారీ గుంత ఉన్న పట్టాలపై ప్రయాణిస్తే అది పడిపోతుందని, చాలామంది ప్రాణాలు పోతాయని ఆలోచన చేశాడు.

వారి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని చాలా తెలివిగా సిగ్నల్ ఇచ్చి రైలు ఆపించాడు.

Telugu Hole, Latest, Malda, Murcelim, Pothole, Railway, Boy, Bengal-Latest News

వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 22న మధ్యాహ్నం సమయంలో ముర్సెలీమ్( Murcelim ) తన ఇంటి దగ్గర కుంటలో చేపలు పడుతున్నాడు.అతడు చేపలు పడుతున్న ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలో రైలు పట్టాలు ఉన్నాయి.అతడు తిరిగి వచ్చేటప్పుడు రైలు పట్టాల కింద పెద్ద గుంతను గమనించాడు.

కొద్ది రోజుల క్రితం ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం వల్ల పట్టాల కింద ఉన్న కంకర చాలా వరకు కొట్టుకు పోయింది.ఒక చోట అయితే భారీ గుంట పడింది.

ఈ గుంటను బాలుడు చూసి అక్కడే ఆగిపోయాడు.వందల మంది ప్యాసింజర్లతో అటువైపుగా కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ స్పీడ్ గా వస్తుండటం చూసి భయపడ్డాడు.

వెంటనే పట్టాల వద్దకు వెళ్లి ట్రైన్ ఆపాలంటూ తాను ధరించిన రెడ్ షర్టు విప్పి మరీ లోకో పైలట్ కి సిగ్నల్ ఇచ్చాడు.

Telugu Hole, Latest, Malda, Murcelim, Pothole, Railway, Boy, Bengal-Latest News

ట్రైన్ ఆగేంత వరకు పట్టాల వద్ద నిల్చున్నాడు.లోకోపైలట్( Loco Pilot ) ముర్సెలీమ్‌ ఇస్తున్న స్ట్రాంగ్ సిగ్నల్ చూసి ఆందోళన చెందాడు.వెంటనే రైలును ఆపి, ఏంటా సంగతి అని కిందికి దిగి చూడగా అక్కడ పెద్ద గుంత కనిపించింది.

ఇది చూసి పెద్ద ప్రమాదం తప్పిపోయింది అంతా ఈ బాలుడు వల్లే అని అందరికీ చెప్పాడు.గుంత గురించి రైల్వే అధికారులకు వెంటనే సమాచారం అందించాడు.కొద్దిసేపటికి జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గుంతను మళ్లీ కంకరతో పూడ్చారు.అనంతరం ట్రైన్ ప్రయాణాన్ని పునఃప్రారంభించింది.

సమయస్ఫూర్తితో వందల మంది ప్రాణాలను కాపాడిన ముర్సెలీమ్ స్థానికంగా హీరో అయిపోయాడు.చాలామంది జనం అతడి ఇంటికి వచ్చి మరీ ప్రశంసించారు.

ముర్సెలీమ్‌కు తన సాహసానికి గుర్తింపుగా, నార్త్‌ఈస్టర్న్‌ ఫ్రాంటియర్ రైల్వే అవార్డు( Railway Award ) ప్రకటించింది.ముర్సెలీమ్ సాహసం చాలా ప్రశంసనీయం.

అతను తన సమయస్ఫూర్తితో వందలాది ప్రాణాలను కాపాడాడు.అతను నిజమైన హీరో అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube