ఈ బుడ్డోడు చేసిన పనికి.. వందల మంది ప్రాణాలు సేఫ్..!

పశ్చిమ బెంగాల్( West Bengal ) రాష్ట్రంలోని మల్దా జిల్లాలోని ఒక పదేళ్ల బాలుడు తన సమయస్ఫూర్తితో వందలాది ప్రాణాలను కాపాడాడు.

పట్టాల కింద పెద్ద గుంత ఉన్నట్లు గమనించిన ముర్సెలీమ్ అనే బాలుడు దానిపైన ట్రైన్ వస్తే ప్రమాదం జరుగుతుందేమోనని గ్రహించాడు.

సరిగ్గా అదే టైమ్‌లో అదే పట్టాలపై దూసుకు వస్తున్న రైలును చూశాడు.ఆ ట్రైన్ భారీ గుంత ఉన్న పట్టాలపై ప్రయాణిస్తే అది పడిపోతుందని, చాలామంది ప్రాణాలు పోతాయని ఆలోచన చేశాడు.

వారి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని చాలా తెలివిగా సిగ్నల్ ఇచ్చి రైలు ఆపించాడు.

"""/" / వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 22న మధ్యాహ్నం సమయంలో ముర్సెలీమ్( Murcelim ) తన ఇంటి దగ్గర కుంటలో చేపలు పడుతున్నాడు.

అతడు చేపలు పడుతున్న ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలో రైలు పట్టాలు ఉన్నాయి.

అతడు తిరిగి వచ్చేటప్పుడు రైలు పట్టాల కింద పెద్ద గుంతను గమనించాడు.కొద్ది రోజుల క్రితం ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం వల్ల పట్టాల కింద ఉన్న కంకర చాలా వరకు కొట్టుకు పోయింది.

ఒక చోట అయితే భారీ గుంట పడింది.ఈ గుంటను బాలుడు చూసి అక్కడే ఆగిపోయాడు.

వందల మంది ప్యాసింజర్లతో అటువైపుగా కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ స్పీడ్ గా వస్తుండటం చూసి భయపడ్డాడు.

వెంటనే పట్టాల వద్దకు వెళ్లి ట్రైన్ ఆపాలంటూ తాను ధరించిన రెడ్ షర్టు విప్పి మరీ లోకో పైలట్ కి సిగ్నల్ ఇచ్చాడు.

"""/" / ట్రైన్ ఆగేంత వరకు పట్టాల వద్ద నిల్చున్నాడు.లోకోపైలట్( Loco Pilot ) ముర్సెలీమ్‌ ఇస్తున్న స్ట్రాంగ్ సిగ్నల్ చూసి ఆందోళన చెందాడు.

వెంటనే రైలును ఆపి, ఏంటా సంగతి అని కిందికి దిగి చూడగా అక్కడ పెద్ద గుంత కనిపించింది.

ఇది చూసి పెద్ద ప్రమాదం తప్పిపోయింది అంతా ఈ బాలుడు వల్లే అని అందరికీ చెప్పాడు.

గుంత గురించి రైల్వే అధికారులకు వెంటనే సమాచారం అందించాడు.కొద్దిసేపటికి జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గుంతను మళ్లీ కంకరతో పూడ్చారు.

అనంతరం ట్రైన్ ప్రయాణాన్ని పునఃప్రారంభించింది.సమయస్ఫూర్తితో వందల మంది ప్రాణాలను కాపాడిన ముర్సెలీమ్ స్థానికంగా హీరో అయిపోయాడు.

చాలామంది జనం అతడి ఇంటికి వచ్చి మరీ ప్రశంసించారు.ముర్సెలీమ్‌కు తన సాహసానికి గుర్తింపుగా, నార్త్‌ఈస్టర్న్‌ ఫ్రాంటియర్ రైల్వే అవార్డు( Railway Award ) ప్రకటించింది.

ముర్సెలీమ్ సాహసం చాలా ప్రశంసనీయం.అతను తన సమయస్ఫూర్తితో వందలాది ప్రాణాలను కాపాడాడు.

అతను నిజమైన హీరో అని చెప్పవచ్చు.

డిజాస్టర్ అని అప్పుడు డిక్లేర్ చేయండి.. రివ్యూల గురించి నాని షాకింగ్ రియాక్షన్ ఇదే!