లక్నోలోని ఠాకూర్‌గంజ్‌లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది.సల్మా అనే మహిళ తన భర్త నాలుకను కొరికి పడేసింది.
తన తల్లి గారింటి నుంచి తన భర్త ఇంటికి తిరిగి రావడానికి ఇష్టం లేని ఆ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది.తన ఇంటికి రమ్మని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినందుకు సల్మా తన భర్త నాలుకను గట్టిగా కొరికింది.
ఎంత గట్టిగా అంటే ఆ భర్త నాలుక ఊడి కింద పడిపోయింది.
సల్మా, ఆమె పిల్లలు చాలా కాలంగా తన తల్లి గారి ఇంట్లోనే నివాసం ఉంటున్నారు.
ఆమెను తిరిగి తీసుకురావడానికి ఆమె భర్త మున్నా వారి ఇంటికి వెళ్ళాడు.అయితే భర్త కోరికను ఆమె తిరస్కరించింది.ఫలితంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.వాగ్వాదం సందర్భంగా, సల్మా తన భర్త నాలుకను పట్టుకుని బలంగా కొరికి నేలపై పడేసింది.
మున్నాకు తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.సల్మాను పోలీసులు అరెస్ట్ చేశారు.
మున్నా, సల్మా మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోందని పశ్చిమ ఏడీసీపీ చిరంజీవ్ నాథ్ సింఘా తెలిపారు.శుక్రవారం, భర్త తన పిల్లలను చూడటానికి తన భార్య తల్లి ఇంటికి వెళ్లగా, గొడవ స్టార్ట్ చేసిన భార్య అతని నాలుకను కొరికిందని పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన భర్తను ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు.నిందితుడు భార్యను అరెస్టు చేశారు.ఈ సంఘటన గురించి తెలిసే స్థానికులు అందరూ అవాక్కవుతున్నారు.

ఈ దంపతులు పెళ్లి చేసుకుని మూడేళ్లు అవుతోంది కాగా మనస్పర్థల కారణంగా గత ఏడాది కాలంగా విడివిడిగా జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఆటో డ్రైవర్ అయిన భర్త మద్యానికి అలవాటు పడ్డట్లు సమాచారం.ఈ ఘటనలో రోగి నాలుక పైభాగంలో తీవ్రగాయాలయ్యాయి.
వైద్య సిబ్బంది గాయాన్ని శుభ్రం చేసి, కుట్లు వేసి సిరను మూసివేశారు.భవిష్యత్తులో రోగి మాట్లాడగలడని వైద్యులు భావిస్తున్నారు.
అయితే, మాట్లాడే పదాలు అంత స్పష్టంగా ఉండకపోవచ్చు అని పేర్కొంటున్నారు.
