'తను పక్కన ఉంటే ఎప్పుడు తెల్లారేదో కూడా తెలిసేది కాదు'అంటూ ఓ లవర్ పంపిన మెసేజ్ ఇది.! అతని సమస్యకు మీ సలహా ఏంటి.?

నా పేరు శివ.అప్పట్లో నాకు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఉండేది.

ఆటోలో వాటర్ బబుల్స్ తీసుకొని ఇనిటింటికి వెళ్లి వాటర్ కాన్ డెలివరీ చేసే పది మంది డెలివరీ బాయ్స్ ఉండేవారు.ఓ రోజు ఓ డెలివరీ బాయ్ రాకపోయేసరికి.

ఒక ఆటోలో వాటర్ క్యాన్స్ డెలివర్ చేయడానికి నేనే వెళ్లాల్సి వచ్చింది.రోజు వేరేవారు వెళ్లేవారు.

నేను వెళ్లడం అదే తొలిసారి.అడ్రస్ లు సరిగా తెలియక ఫోన్ చేసి అడ్రస్ కనుక్కొని వెళ్ళేవాడిని.

Advertisement

అలా ఓ కస్టమర్ కి కాల్ చేసినప్పుడు.అవతలి పక్కన ఫోన్ ఎత్తిన ఓ అమ్మాయి ఫోన్ లోనే తిట్లతో నాకు చివాట్లు పెట్టేసింది.

రెండ్రోజుల నుంచి మాకు క్యాన్ డెలివరీ చేయడం లేదు.మీరు వెంటనే క్యాన్స్ తీసుకుని ఇంటికి రండి అంటూ ఫైర్ అయ్యింది.

వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళా నేను."మీవాళ్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు.

ఒక్కోసారి క్యాన్ గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టి వెళ్తారు.మా ఇళ్లు థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

లిఫ్ట్ కూడా లేదు.ఇంట్లో నేను మా అమ్మనే ఉంటాం.

Advertisement

మేము క్యాన్స్ ఎలా తీసుకెళ్లాలి." అంటూ తన బాధను చెప్పింది.

మీ ఓనర్ కి కంప్లైంట్ చేస్తా.నెంబర్ చెప్పు అని అడిగేసరికి.

నేనే ఓనర్ ని అని చెప్పాల్సివచ్చింది.వెంటనే ఆ అమ్మాయి సారీ అండీ కూర్చొండి అని చైర్ తెచ్చింది.

టీ ఇస్తే తాగాను.ఆమె చాలా అందంగా ఉంది.

మొదటి చూపులోనే ప్రేమించేయాలి అనిపించింది.ఇంతలో ఆ అమ్మాయి తన ఫామిలీ గురించి చెప్పా సాగింది.

ఇంట్లో నేను మా అమ్మనే ఉంటామండీ.మా నాన్న లేరు.

ఈ సిటీలో ఏది తెచ్చుకోవాలన్నా బాగా ఇబ్బందిపుడుతున్నామంది.అందుకే మీపై కోప్పడ్డాను అంది.

ఆ మాటలకు నేను."మీకు ఏ సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి" అంటూ నా నెంబర్ ఇచ్ఛా.అలా పరిచయం ఏర్పడింది.

తర్వాత వాళ్ళ ఇంటికి కావాల్సిన సామాన్లు నేనే దగ్గరుండి ఇప్పించా.మా కుర్రాళ్లతో చెప్పి వాళ్ళ ఇంటికి అన్ని టైం కి అందేలా చేశా.

నెల సరుకులు, వంట గ్యాస్ ఇలా చాలా విషయాల్లో ఆ అమ్మాయి సహాయం కోసం నాకు ఫోన్ చేసేది.కొద్దీ రోజుల్లోనే ఇద్దరం క్లోజ్ అయ్యాం.

ఆ అమ్మాయి కూడా అప్పుడప్పుడు మా వాటర్ ప్లాంట్ కి వచ్చేది.వాళ్ళ అమ్మ గారికి కూడా నాపై మంచి అభిప్రాయం ఏర్పడింది.

వాళ్ళ ఇంట్లో ఒకరిగా నేను కలిసిపోయాను.ఓ సారి తను బైక్ డ్రైవింగ్ నేర్పించమని అడిగింది.

రోజు హైవే పై డ్రైవింగ్ నేర్పించేవాడిని.తను పక్కన ఉంటే ఎప్పుడూ తెల్లారేదో కూడా తెలిసేది కాదు.

తను హ్యాండిల్ సరిగా తిప్పలేకపోతే చేతులపై చేతులు వేసి నేనే నేర్పించా.క్రమంగా మేము ఇద్దరం ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేని పరిస్థితికి వెళ్లాం.

ఆ అమ్మాయి నాకంటే ఎక్కువ చదువుకుంది.ఓ పెద్ద సాఫ్ట్ వెర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.ఇప్పుడు నా ప్రేమను చెప్తే ఉన్న స్నేహం కూడా పోతుందేమో అని బయపడుతున్నాను.

చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని బాధ కూడా మరోవైపు.నేనేం చేయాలో మీ సలహా ఇవ్వండి.! .

తాజా వార్తలు