Marcel Paul : కేవలం బొమ్మకారుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన వ్యక్తి.. వీడియో వైరల్..

గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరును లికించుకోవాలని చాలామంది తపన పడుతుంటారు.కొందరు చాలా వినూత్నంగా ఆలోచనలు చేసి ఆ రికార్డును క్రియేట్ చేస్తుంటారు.

తాజాగా జర్మనీకి( Germany ) చెందిన మార్సెల్ పాల్( Marcel Paul ) అనే వ్యక్తి అత్యంత వేగంగా బొమ్మ కారును నడుపుతూ సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాడు.అతను ఎలక్ట్రిక్ బొమ్మ కారును మాడీఫైడ్ చేసి దానిని గంటకు 148.454 కిమీ వేగంతో వెళ్లేలా చేశాడు.అతను జర్మనీలోని హాకెన్‌హైమ్రింగ్ అనే రేస్ ట్రాక్‌లో ఈ వేగాన్ని సాధించగలిగాడు.

మార్సెల్ ఫుల్డా యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌లో( Fulda University of Applied Sciences ) ఓ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్.అతను పది నెలలు కష్టపడి తన బొమ్మ కారును తయారు చేశాడు.తన ప్రాజెక్ట్‌ను 2023, జులైలో ఫినిష్ చేసి 2023, ఆగస్టులో తన కలను సాధించాడు.

అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తాజాగా అతని వీడియోని షేర్ చేసింది.మార్సెల్ బ్యాక్ టు ది ఫ్యూచర్ అనే సినిమా ( Back to the Future )ద్వారా మార్సెల్ స్ఫూర్తి పొందారు.సినిమాలో డెలోరియన్ అనే కారు 141.62 km/h కంటే వేగంగా వెళ్తుంది.మార్సెల్ తన బొమ్మ కారుతో ఆ వేగాన్ని అధిగమించాలనుకున్నాడు.

Advertisement

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో మార్సెల్ రికార్డ్ వీడియోను షేర్ చేయగా దానికి ఇప్పటికే ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.చాలా మంది ఈ వీడియోపై కామెంట్లు చేస్తూ మార్సెల్ సృజనాత్మకత, ధైర్యాన్ని ప్రశంసించారు.కొంతమంది జోకులు కూడా చేసారు, మార్సెల్‌ను సినిమాలు, క్రీడలలోని పాపులర్ క్యారెక్టర్స్‌తో పోల్చారు.

అంత వేగంతో ఈ బొమ్మ కారు వెళుతున్నప్పుడు కింద పడితే పరిస్థితి ఏంటి? అని మరి కొంతమంది ప్రశ్నించారు.దీనికి చాలా ధైర్యం కావాలని కొందరు అన్నారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

బంగ్లాదేశ్‌లో జెట్ స్టంట్ విషాదాంతం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు