సాధారణంగా మనం రాళ్లతో చేసిన రకరకాల ఆకారాలు, నిర్మాణాలు, విగ్రహాలు, ఇంకా ఇతర అలంకార వస్తువులను చూస్తూనే ఉంటాం.కానీ ఒక వ్యక్తి మాత్రం కాస్త కొత్తగా ఆలోచించి బండ రాళ్లను ఉపయోగించి అద్భుతమైన కారును తయారు చేశాడు.
ఆ కారును చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ప్రస్తుతం ఈ వెరైటీ కారు సోషల్ మీడియాలో లైకులు, షేర్లు, కామెంట్లతో బ్రేకులు లేకుండా దూసుకుపోతోంది.

తెలివి తేటలు అనేవి ఏ ఒక్కరి సొంతం కాదు.కొంతమంది తమ తెలివితేటలను ఉపయోగించి కొత్త కొత్త వస్తువులను తయారు చేస్తూ దానిని సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి మన్ననలు పొందుతుంటారు.ముఖ్యంగా నిర్మాణ రంగంలో క్రియేటివ్‌గా కట్టిన భవనాలు, బంగ్లాలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం.అయితే రాళ్లతో ( stones )ఒక కచ్చితమైన కారును( car ) రూపొందించడానికి ఒకరు అటువంటి సృజనాత్మక ఆలోచనకు పదును పెట్టారు.
ప్రస్తుతం వారి ఆలోచనకు వచ్చిన రూపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక వ్యక్తి బండ రాళ్లను ఉపయోగించి అద్భుతమైన కారును తయారు చేశాడు.దూరం నుంచి చూస్తే అది నిజంగా కారులానే కనిపిస్తుంది.ఎందుకంటే రాళ్లతో తయారు చేసిన ఈ కారులో టైర్ల నుంచి హెడ్ లైట్ల వరకు, అద్దాల నుంచి నంబర్ ప్లేట్ల వరకు అన్ని పర్ఫెక్ట్‌గా అమర్చాడు.
అంతే కాదు, కిటికీలు వెనుక వైపు గ్లాస్ విండో కూడా నిజమైన కారులోని గాజులాగానే రాయితో తయారు చేశారు.అందుకే మార్గం మధ్యలో నిలబడిన ఈ కారు చాలా మందిని ఆకర్షిస్తూ ఉండటంతో ఆ వ్యక్తిలోని ఈ క్రియేటివిటీ ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయంశం గా మారింది.







