రాజస్థానీ గాగ్రా-చోళీ ధరించి ఫారిన్ దేశంలో చక్కర్లు.. యువతి వీడియో వైరల్..

ఇటీవల కాలంలో భారతీయ మగువలు ఇండియన్ కల్చర్, ఇండియన్ డ్రెస్సింగ్ స్టైల్‌ను ప్రపంచ వేదికగా ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.

చాలామంది చీర కట్టుకుని లండన్( London ) వీధుల్లో తిరగడం, అమెరికా వీధుల్లో నడవడం మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా మరో ఒక భారతీయ మహిళ ఒక పరాయి దేశంలో రాజస్థానీ గాగ్రా ఛోళీ( Rajasthani Gagra Choli ) ధరించి వీధుల్లో నడించింది.ఆమె అలా నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆమెను రాజస్థానీ ఘాగ్రా ఛోళీలో చూసి చాలామంది విదేశీయులు ఆశ్చర్యపోయారు.ఆమె అందమైన దుస్తులకు ఫిదా అయిపోయారు.కొంతమంది ఆమె ఫోటోలు కూడా తీసుకున్నారు.

ఈ భారతీయ యువతి ధరించిన రెడ్-యెల్లో గాగ్రా ఛోళీ అద్భుతంగా ఉండటంతో చాలామంది ఫిదా అవుతున్నారు.ఈ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్, 74,101 లైక్‌లు వచ్చాయి.

Advertisement

చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆమెను అభినందించారు.

ఒక వ్యక్తి కామెంట్ చేస్తూ "మన సంస్కృతి, మన దుస్తులే మన గుర్తింపు." అని అన్నారు."ఈ మోడ్రన్ వరల్డ్‌లో మన భారతీయ సంస్కృతి గౌరవాన్ని కాపాడటానికి మీరు చాలా చేశారు, ధన్యవాదాలు!" అని ఒక నెటిజన్ అభినందించాడు.

మొత్తంమీద, ఈ వీడియోను చూసిన ప్రేక్షకుల నుంచి ఈ మహిళకు చాలా ప్రశంసలు లభించాయి.ఇలాంటి మరో సంఘటనలో, మే నెలలో జపాన్ వీధుల్లో బ్లూ కలర్ శారీ ధరించి, తిరుగుతున్న ఒక మహిళ వీడియో కూడా వైరల్ అయింది.

ఆమె చీరపై అద్భుతమైన గోల్డెన్ బోర్డర్స్ కూడా కనిపించాయి.భవిష్యత్తులో మగవారు కూడా భారతీయ సంస్కృతిని ప్రదర్శించవచ్చు.గతంలో ఒక యువతి మగవారు కట్టే లుంగీ కట్టి ఓ విదేశంలో తిరిగింది.

చిగుళ్ల నుంచి తరచూ రక్తం వస్తుందా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
ఆ విషయంలో ఎన్టీఆర్ అసలు మనిషే కాదు... సంచలనంగా మారిన అజయ్ కామెంట్?

ఆ వీడియో కూడా వైరల్ అయింది.

Advertisement

తాజా వార్తలు