పంచాయతీ ఎన్నికల సమరం రెడీ అయింది.ఇప్పటి వరకు తీవ్ర ఉత్కంఠకు దారితీసిన పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పేసింది.
ఎన్నికలు నిర్వహించి తీరాలని తేల్చి చెప్పింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమైం ది.ఇక, ఇప్పుడు ఏం జరుగుతుంది.వాస్తవానికి పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగవు.
గ్రామపంచాయతీల్లో ప్రత్యేకంగా ఇచ్చే గుర్తుపైనే ఎన్నికలు జరుగుతాయి.అయితే పార్టీలు మాత్రం అభ్యర్థులను బల పరుస్తాయి.
అయినప్పటికీ ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం ఎన్నికల వేడి జోరుగా ఉంది.మేమే పంచాయతీలను గెలుస్తామని కాదు మేమే గెలుస్తామని రెండు ప్రధాన పక్షాలు కూడా పోటీ పడుతున్నాయి.

మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 12 వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి.వీటిలో ఇప్పటి వరకు టీడీపీనే హవా చలాయించింది.గత 2013 ఎన్నికల్లో టీడీపీ దూకుడు బాగానే చూపించింది.ఆ పార్టీ మద్దతుతో క్లీన్ స్వీప్ చేసిన పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయి.ఇక, ఇప్పుడు అధికారంలో వైసీపీ ఉండడం, ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ఉండడంతో పంచాయతీల్లో ఎవరు పైచేయి సాధిస్తారు? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది.వాస్తవానికి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అధికార పార్టీ దూకుడు చూపించిన చరిత్ర కనిపిస్తోంది.

అదేతరహాలో ఏపీలోనూ వైసీపీ దూకుడు చూపిస్తుందనే అంచనాలు వస్తున్నాయి.పైగా పంచాయతీ ఎన్నికలకు ఏది ముఖ్యమని జగన్ భావించారో ఆయా కార్యక్రమాలు పూర్తయ్యాయి.పేదలకు ఇళ్ల పథకాన్ని ఎన్నికలకు ముందు పూర్తి చేయాలని అనుకున్నారు.అది పూర్తయింది.ఈ నెల 30 వరకు కూడా అనేక నియోజకవర్గాల్లో ఇళ్ల పంపిణీ జరగనుంది.దీనికి ఎన్నికల కమిషనర్ కూడా అడ్డు చెప్పలేదు.
ఇక, అమ్మ ఒడి ఈ నెల ఆఖరు వరకు బ్యాంకు ఖాతాల్లో పడతాయని పేర్కొన్నారు.దీనికి కూడా ఎన్నికల సంఘం వెనక్కి చెప్పలేదు.
ఈ రెండు కార్యక్ర మాలను మేజర్‌గా తీసుకున్న జగన్ రైతు భరోసాను కూడా ప్రధానంగా భావిస్తున్నరు.ఇది కూడా ఇప్పటికే పూర్తయింది.ఈ నేపథ్యంలో గత పరిణామాలను గమనిస్తే.అధికార పక్షానిదే పైచేయి అంటున్నారు పరిశీలకులు.
టీడీపీ విషయానికి వస్తే.నేతల మధ్య సఖ్యత లేమి స్పష్టంగా కనిపిస్తోంది.
దీంతో పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షానిదే పైచేయి ఖాయమని అంటున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి.