టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అయ్యి ఏడాది గడిచింది.ఆ తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని ఇంకా స్టార్ట్ చేయకపోవడంతో మహేష్ అభిమానుల ఆయన కొత్త సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందించిన వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహేష్ మరో సినిమా చేసేందుకు అప్పట్లో ఆసక్తిని చూపాడు.
దీంతో వంశీ మహేష్ కోసం అప్పటినుండి ఓ కథను రెడీ చేసే పనిలో పడ్డాడు.
కానీ మహేష్ బాబు మాత్రం ఇతర డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తూ వంశీ పైడిపల్లిని పట్టించుకోవడం మానేశాడు.ఇక మహేష్ సమాధానం కోసం ఎదురుచూసి విసుగెత్తిన వంశీ కూడా ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలోనే ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా మారాడు ఈ డైరెక్టర్.అయితే వంశీ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ కావడంతో, సినిమాల డైరెక్షన్‌ను పక్కనబెట్టాలని చూస్తున్నాడట ఈ డైరెక్టర్.
మహేష్ బాబుతో సినిమా చేయాలనే ఆసక్తిని కూడా వంశీ పైడిపల్లి పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.మహేష్ కోసం ఎన్నో నెలలుగా వెయిట్ చేస్తున్న వంశీ ఇప్పుడు వెబ్ సిరీస్ కోసం సినిమా ప్లాన్‌ను పక్కనబెట్టేయడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఈ డైరెక్టర్ ఇప్పటికే ‘పిట్ట కథలు’ అనే వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తుండగా, ఇది హిందీలో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’కు రీమేక్‌గా వస్తోన్న సంగతి తెలిసిందే.మరి వంశీ పైడిపల్లి తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనే అంశం కన్నా, ఆయన మహేష్ బాబు సినిమాను పక్కనబెట్టాడనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అటు మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్ర షూటింగ్‌ను దుబాయ్‌లో తాజాగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.