ట్రంప్ ఈ పరిణామం ఊహించి ఉండడు..!!!

అమెరికాలో షట్ డౌన్ కి తెరపడింది.అమెరికా ప్రతినిధుల సభ అందుకు ఆమోదం తెలిపింది.

షట్ డౌన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా బిల్లు ని పాస్ చేసింది.అయితే ఈ బిల్లు పాస్ అయ్యేలా చేసింది డెమొక్రాట్స్.

దాంతో ట్రంప్ కి దిమ్మ తిరిగిపోయిన పరిస్థితికి వచ్చింది.ఈ పరిణామం ట్రంప్ ఊహించి ఉండడు అంటున్నారు డెమొక్రాట్స్.

మెక్సికో తో సరిహద్దు గోడ నిర్మాణం విషయం ఎన్ని ఇబ్బన్దులనీ తెచ్చి పెట్టిందో వేరే చెప్పనవసరం లేదు.

Advertisement

ట్రంప్ మొండి పట్టుదలతో అమెరికా వ్యాప్తంగా ఎంతో మంది పౌరులు ఆర్ధిక అవసరాల దృష్ట్యా ఇబ్బందులు పాలయ్యారు.అయినా సరే ట్రంప్ తన మొండి వైఖరితో ప్రజలని ఇబ్బందులు పాలు చేస్తూనే ఉన్నాడు.మెక్సికోతో సరిహద్దులో గోడ నిర్మాణానికి ట్రంప్ చేస్తున్న డిమాండ్ పక్కన పెట్టి.

నిధులు ఇవ్వకుండానే సభ బిల్లుని ఆమోదించింది.ఈ పరిణామాలకి కారణం గత నవంబరులో జరిగిన మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఆధిక్యం సాధించడమే.

రిపబ్లికన్లు ఈ బిల్లుని వ్యతిరేకించినా సరే మెజారిటీ డెమొక్రాట్స్ వైపు ఉండటంతో బిల్లుపాస్ అయ్యింది.అయితే సెనేట్‌లో రిపబ్లికన్లదే పైచేయి.ఒకవేళ యూఎస్‌ కాంగ్రెస్‌ గోడకు నిధులు కేటాయించకుండా బిల్లును ఆమోదిస్తే ట్రంప్‌ వీటో అధికారాలతో దాన్ని రద్దు చేస్తానని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తాయో.?? .

మా అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం.. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో తీర్మానం
Advertisement

తాజా వార్తలు