టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విచారణ ముగిసింది.ఈ నేపథ్యంలో తన సెల్ ఫోన్ తో సహా విచారణకు హాజరైనట్లు ఈటల తెలిపారు.
పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని ఈటల వెల్లడించారు.ప్రశాంత్ నుంచి తనకు ఎటువంటి ఫోన్ కానీ, మెస్సేజ్ కానీ రాలేదని నిర్ధారించుకున్నారన్నారు.
ప్రశాంత్ అనే వ్యక్తితో తనకు సంబంధం లేదని చెప్పానని ఈటల పేర్కొన్నారు.మహేశ్ అనే వ్యక్తి తన ఫోన్ కు వాట్సాప్ మెస్సేజ్ పంపారని, ఆ మెస్సేజ్ తాను చూడలేదని తెలిపారు.
ఈ క్రమంలో దాన్ని వేరే వాళ్లకు పంపించే ఆస్కారం లేదని పోలీసులు గుర్తించారని వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే పేపర్ లీకేజీ పచ్చి అబద్ధమని, అది మాల్ ప్రాక్టీస్ మాత్రమేనని స్పష్టం చేశారు.