పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.మరి పవర్ స్టార్ సెకండ్ ఇన్నింగ్స్ ను ”వకీల్ సాబ్” ( Vakeel Saab ) సినిమాతో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా పవర్ స్టార్ కు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది అనే చెప్పాలి.ఇది రీమేక్ సినిమా అనే చిన్న నిరుత్సాహం తప్ప పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కూడా బాగా మెప్పించింది.
పవర్ స్టార్ కు బ్లాస్టింగ్ రీ ఎంట్రీ వకీల్ సాబ్ తో వచ్చింది.మరి కొన్ని ఇబ్బందుల మధ్య రిలీజ్ అయినా కూడా భారీ వసూళ్లను రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
ఇలాంటి సినిమాను తెరకెక్కిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ అప్పటి నుండి పవన్ ఫ్యాన్స్ కు ఫేవరేట్ గా కూడా మారిపోయాడు.ఈ సోషల్ డ్రామాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని సాలిడ్ మూమెంట్స్ ను అందించాడు.
మరి అలాంటి ఈ సినిమాతో వేణు శ్రీరామ్ మాస్ గాడ్ అని పిలిపించు కుంటున్నారు.వకీల్ సాబ్ రిలీజ్ అయ్యి నిన్నటికి సరిగ్గా 2 సంవత్సరాలు అయ్యింది.ఈ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేణు శ్రీరామ్ పవన్ ఫ్యాన్స్ తో ట్విట్టర్ లో చాట్ సెషన్ చేసారు.ఈ ట్విట్టర్ స్పేస్ లో వకీల్ సాబ్ 2 ( Vakeel Saab 2 ) గురించి కూడా క్లారిటీ ఇచ్చి వేణు శ్రీరామ్ మరోసారి వార్తల్లో నిలిచారు.
తాజాగా వేణు శ్రీరామ్ ( Venu Sriram ) నిర్వహించిన చాట్ సెషన్ లో వకీల్ సాబ్ 2 ఉందని కన్ఫర్మ్ చేసాడు.ఈ సినిమాకు సీక్వెల్ ఉందని చెప్పడం ఇప్పుడు నెట్టింట క్రేజీగా మారి పోయింది.ప్రస్తుతం స్క్రిప్ట్ రాస్తున్నానని చెప్పడంతో వకీల్ సాబ్ 2 ను ట్విట్టర్ లో ట్రెండ్ చేసున్నారు ఫ్యాన్స్.మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్న ఈ సీక్వెల్ మూవీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.