నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గాలివాన బీభత్సం సృష్టించింది.ఉదయం నుండి భానుడి తాపానికి అల్లాడిన ప్రజలు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి ఆకాశం మేఘావృతమై ఉన్నఫలంగా ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
గాలులతో ఉదయగిరి బీసీ కాలనీలో పైపు మంచం గాలిలోకి లేచి విద్యుత్ వైరులకు తగిలి నిలిచిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ట్యాంక్ బండ్ మీద వున్న భారీ వృక్షాల నేలకొరిగాయి .దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడింది .దీంతో పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి
.