నారా లోకేశ్ పాదయాత్రకు ముహుర్తం ఖరారు

ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.ఈ మేరకు పాదయాత్రకు పార్టీ వర్గాలు ముహుర్తం ఖరారు చేశాయి.

 The Time For Nara Lokesh Padayatra Has Been Decided-TeluguStop.com

దీంతో 2023 జనవరి 27న నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి లోకేశ్ యాత్ర మొదలు కానుంది.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగిసే అవకాశం ఉంది.కాగా ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండే విధంగా నారా లోకేశ్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది.

రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా పాదయాత్ర చేయనున్నారు.అదేవిధంగా యువతకు భాగస్వామ్యం కల్పిస్తూ లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది.

ఇందుకు గానూ పార్టీలోని యువనేతలు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం పాదయాత్ర షెడ్యూల్ లో మార్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube