ఆ ముగ్గురిని కలిసింది సినిమా కోసం కాదు.. హను రాఘవపూడి కామెంట్స్ వైరల్!

హను రాఘవపూడి సీతారామం సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ దర్శకుడికి ప్రస్తుతం తెలుగులో మరికొన్ని అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసును ఆకట్టుకుంది.

 The Three Met Not For The Film Hanu Raghavapudis Comments Are Viral , Sitaram M-TeluguStop.com

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం కావడంతో ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముందుగా ఈ సినిమాలో నటించే అవకాశం కోసం దర్శకుడు హను రాగవపూడి పలువురు హీరోలను సంప్రదించారని వీళ్ళందరూ కాదంటేనే దుల్కర్ సల్మాన్ కి ఈ అవకాశం వచ్చిందంటూ వార్తలు వచ్చాయి.

ముందుగా ఈ సినిమా కథతో హనురాగవపూడి హీరో విజయ్ దేవరకొండ, రామ్,నాచురల్ స్టార్ నానిని కలిసారని ఈ ముగ్గురికి కథ వినిపించినప్పటికీ ఈ ముగ్గురు సినిమాని రిజెక్ట్ చేయడం వల్లే దుల్కర్ సల్మాన్ వద్దకు ఈ సినిమా వెళ్లిందని వార్తలు వచ్చాయి.

Telugu Dulquer Salmaan, Mrinal Tagore, Nani, Seetharam, Sitaram, Lover-Movie

ఈ వార్తలపై డైరెక్టర్ హను రాఘవపూడి స్పందించి అసలు విషయం వెల్లడించారు.నేను ఈ సినిమా కథ వినిపించడం కోసం ఆ ముగ్గురు హీరోలను కలవలేదని ఈయన క్లారిటీ ఇచ్చారు.తాను ఎప్పుడు ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని కథ సిద్ధం చేయనని కథ పూర్తిగా సిద్ధం చేసిన తర్వాత ఆ సినిమా ఎవరికి సరిపోతుందని తెలుసుకున్న తరువాతే ఆ హీరోలను సంప్రదిస్తానని ఈయన తెలియజేశారు.

నానితో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా చేయాలని అతనిని కలిసాను అలాగే రామ్ ను కలిసిన మాట నిజమే కానీ ఈ సినిమా కోసం తనని కలవలేదని అదేవిధంగా విజయ్ దేవరకొండను వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా సమయంలో కలిశానని అయితే ఈ సినిమా కోసమే తనని కలవలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube