మోచా తుపాన్ ముప్పు ముంచుకు వస్తుంది.తూర్పు తీర ప్రాంతాలపై తుపాను ప్రభావం చూపనుంది.
ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడనుందని హెచ్చరించింది.
ఎల్లుండి బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతం కానుందని ఐఎండీ వెల్లడించింది.ఈ క్రమంలో ఈనెల 9 వ తేదీన తుపాను తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.
తుపాను ప్రభావంతో తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.కాగా అండమాన్ నికోబార్ దీవులతో పాటు ఒడిసాపై ఈ తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించింది.







