ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది.అయితే కారు కొనడం కంటే.
కారు ( Car ) మెయింటైన్ చేయడం చాలా కష్టం.ఎందుకంటే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.
ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లు( Electric Cars ) మార్కెట్లోకి వచ్చి మధ్యతరగతి కుటుంబాలకు కాస్త ఊరట కల్పించాయి.ప్రస్తుత మార్కెట్లో బైక్ కొనాలంటే కనీసం ఒక లక్ష అయినా ఉండాలి.
అదే కారు కొనాలంటే పది లక్షల పై మాటే.మరి బడ్జెట్ ధరలో కారు కొనాలి అనుకుంటే ఎంజీ కామెట్ ఈవీ( MG Comet EV ) బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఈ కంపెనీకి చెందిన పేస్, ప్లే, ప్లష్ అనే 3 వేరియంట్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి.

ఇందులో పేస్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.7.98 లక్షలు, ప్లే వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.9.28 లక్షలు, ప్లష్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.9.98 లక్షలు గా ఉన్నాయి.ఈ ధరలు కేవలం మొదట బుక్ అయ్యే ఐదువేల బుకింగ్స్ వరకు మాత్రమే ఉంటాయని కంపెనీ తెలపింది.కార్లను 2023 మే 22 నుండి డెలివరీ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.ఈ కామెట్ ఎలక్ట్రిక్ కారు 17.3 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది.ఒకసారి చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు.ఇందులో 3.3 కిలోవాట్ చార్జింగ్ సామర్ధ్యం ఉంది.ఇక ఈ కారుకు మూడేళ్ల లేదా లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ ఉంది.
ఇక బ్యాటరీకి 8 ఏళ్లు లేదా 1,20,000 కి.మీ వారంటీ ఉంది.

మూడేళ్ల తర్వాత కారు అమ్మాలనుకుంటే కంపెనీ మీరు కొన్న ధరలో 60% డబ్బులు చెల్లించి కొనుక్కుంటుంది.ఉదాహరణకు 10 లక్షలు పెట్టి కారు కొంటే మూడేళ్ల తర్వాత అమ్మాలనుకుంటే కంపెనీ కారు కొని 60 శాతం అంటే రూ.6 లక్షలు చెల్లిస్తుంది.సంవత్సరం తర్వాత రీసెల్ చేస్తే వాల్యూ సగానికి పైగా పడిపోతుంది.
కంపెనీ మూడేళ్ల తర్వాత సగానికి పైగా డబ్బులు చెల్లిస్తుంది.కారుపై వారంటీతో పాటు ఈ బంపర్ ఆఫర్ ను కంపెనీ ప్రకటించింది.







