ఉదయం 6 గంటలు అవుతుందంటే చాలు నెమ్మది నెమ్మదిగా సూర్యాస్తమయం అవుతుంది.మబ్బులను చీల్చుకు వచ్చిన సూర్యుడు మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి నడి నెత్తిమీదకు వస్తాడు.
తన ప్రతాపాన్ని రోజంతా చూపి సాయంత్రం 6 అయ్యే సమయానికి మళ్ళీ మెల్లిమెల్లిగా మబ్బుల చాటుకు వెళ్ళిపోతాడు.దాంతో చీకటి రాజ్యమేలుతుంది.
ఇది మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న ప్రక్రియే.అయితే.
ఓ గ్రామంలో మాత్రం ఇందుకు భిన్నంగా సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతుంది.సూర్యోదయం కూడా మనకన్నా గంట ఆలస్యంగా వస్తుంది.
వివరాల్లోకి వెళ్తే.తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా.సుల్తానాబాద్ మండలంలో కొదురుపాక అనే గ్రామం ఉంది.అయితే.
ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.అన్ని గ్రామాల్లో లాగా కాకుండా ఈ ఊర్లో సూర్యుడు పొద్దున ఉదయించడం కొద్దిగా ఆలస్యంగా, అస్తమించడం త్వరగా జరుగుతుంది.
ఈ కుదురుపాక గ్రామానికి చుట్టూ నాలుగు వైపుల గుట్టలు ఉన్నాయి.ఈ ఊరికి నాలుగు దిక్కులా ఆవరించి ఉన్న గుట్టలు ఇక్కడి సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలపై ప్రభావం చూపిస్తున్నాయి.
తూర్పున ఉన్న గొల్లగుట్ట… ఈ గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది.ఇక 4 గంటల ప్రాంతంలో సూర్యుడు… గ్రామ పడమర దిక్కున ఉన్న రంగనాయకుల గుట్ట వెనక్కి వెళ్తాడు.
దీంతో ఈ గ్రామాన్ని చీకటి అలుముకుంటుంది.

ఈ ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల ప్రభావం ఇక్కడి ప్రజల నిత్యజీవితంపై కూడా పడుతోంది.జనం తమ పనులు ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకుంటారు.ఊర్లో పని చేసుకునే మహిళలు మధ్యాహ్నం మూడు గంటల వరకే ఇంటికి చేరుకుని ఇంట్లో పనులు చేసుకుంటారట.
పచ్చదనం పరుచుకొని ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది, ఊర్లో నవాబుల కాలంలో నాటి గుడి, ఊరు చుట్టూ పారే కానాల వాగు, చల్లటి గాలులు, స్వచ్ఛమైన గాలి నడుమ ఈ గ్రామం ఎంతో అందంగా ఆహ్లదకరంగా ఉంటుంది.







