తల్లిదండ్రులు తమ బిడ్డలపై అమితమైన ప్రేమను కురిపిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.బిడ్డ పుట్టినప్పుడు తల్లి ఎంత ఆనందిస్తుందో అంతకుమించి తండ్రి కూడా సంతోషిస్తాడు.
తొలిసారిగా తండ్రైనప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది.అయితే ఈ సంతోషం, ఆనందం అనేది కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాలేదు.
జంతువులు కూడా బిడ్డ పుట్టిన విషయం తెలియగానే బాగా ఖుషి అవుతాయి.అయితే తాజాగా ఒక తండ్రి జిరాఫీ కూడా తన కొడుకుని చూసి పరవశించి పోయింది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ తండ్రి జిరాఫీ, కొడుకు జిరాఫీల సన్నివేశం యూఎస్‌లోని కాలిఫోర్నియా బార్బరా జూలో వెలుగు చూసింది.వైరల్ అవుతున్న వీడియో లో అప్పుడే జన్మించిన తన బిడ్డను చూసుకునేందుకు తండ్రి జిరాఫీ ఒక చోటు వద్దకు రావడం చూడొచ్చు.
జూ నిర్వాహకులు తల్లిబిడ్డలకు ఓ ఎన్‌క్లోజర్ కేటాయించారు.ఇదే ఎన్‌క్లోజర్ వద్దకు తండ్రి జిరాఫీ విచ్చేసింది.అనంతరం తన బిడ్డను తల కిందికి దించి చాలా ఆప్యాయంగా చూస్తూ మురిసిపోయింది.ఆ పిల్ల జిరాఫీ మెల్లగా అటూ ఇటూ చిందులేస్తుంటే అలాగే కళ్ళార్పకుండా చూసింది.
తన కొడుకు అని పరవశించిపోతూ అది చాలా ఎమోషనల్ అయ్యింది.అనంతరం తన భార్య జిరాఫీని ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దాడింది.
అంతటితో వీడియో ముగిసింది.ఈ వీడియోని ట్విట్టర్‌లో ఒక యూజర్ షేర్ చేశారు.
దీనికి ఇప్పటికే లక్షకుపైగా వ్యూస్, వేల కొద్ది లైక్స్, కామెంట్స్ వచ్చాయి.ఈ హార్ట్ టచింగ్ వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.







