ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం కానుంది.నిన్న ప్రభుత్వంతో జరిపిన సమ్మె విఫలం కావడంతో ఆందోళనలను తీవ్రస్థాయిలో కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
ఈ మేరకు ఈనెల 31 వ తేదీన మున్సిపాలిటీల్లో కరెంట్, నీళ్లు నిలిపివేయాలని మున్సిపల్ కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది.కార్మికుల సమ్మెకు మున్సిపాలిటీల్లో పని చేసే రెగ్యులర్ ఉద్యోగులు మద్ధతు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జనవరి ఒకటో తేదీ తరువాత రెగ్యులర్ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగే అవకాశం ఉందని సమాచారం.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 105 మున్సిపాలిటీల్లో గత నాలుగు రోజులు సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
దీంతో రోడ్లపై ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది.