ఏపీలో ఉధృతం కానున్న మున్సిపల్ కార్మికుల సమ్మె..!
TeluguStop.com
ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం కానుంది.నిన్న ప్రభుత్వంతో జరిపిన సమ్మె విఫలం కావడంతో ఆందోళనలను తీవ్రస్థాయిలో కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
ఈ మేరకు ఈనెల 31 వ తేదీన మున్సిపాలిటీల్లో కరెంట్, నీళ్లు నిలిపివేయాలని మున్సిపల్ కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది.
కార్మికుల సమ్మెకు మున్సిపాలిటీల్లో పని చేసే రెగ్యులర్ ఉద్యోగులు మద్ధతు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జనవరి ఒకటో తేదీ తరువాత రెగ్యులర్ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగే అవకాశం ఉందని సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 105 మున్సిపాలిటీల్లో గత నాలుగు రోజులు సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
దీంతో రోడ్లపై ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది.
శివలింగానికి సాష్టాంగ నమస్కారం చేసిన చిరుత.. కెమెరా కంటికి చిక్కిన అద్భుత దృశ్యం..!