బాలయ్య బాబు( Balayya babu ) తో సినిమా చేయాలి అంటే ఒక మంచి కథని ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఆయనకు చెప్పి ఒప్పించి సినిమా చేయాల్సి ఉంటుంది.అయితే బాలయ్య బాబు కొందరు డైరెక్టర్లకు మాత్రం స్టోరీ బాగలేకపోయినా ఆ డైరెక్టర్ యొక్క బిహేవియర్ బాగుండి సినిమాని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఆయనకి ఉంది అని బాలయ్య బాబు నమ్మితే ఆ డైరెక్టర్ కి సినిమాలు ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి.

అలాంటి బాలయ్య బాబు ( Balayya babu )వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకి పోటీ ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన భగవత్ కేసరి( Bhagavanth Kesari ) ట్రైలర్ అద్భుతంగా ఉంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఆయనలోని ఆ మాస్ ఎలిమెంట్స్ ని డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా అద్భుతంగా తీశారు ఆయన్ని చాలా బాగా చూపించారు.
అయితే ఒకప్పుడు బాలయ్య బాబు బి గోపాల్ ( B.Gopal )కాంబినేషన్ అంటే ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉండేది వాళ్ళిద్దరి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.అలాంటిది వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన కొన్ని సినిమాల్లో మాత్రం బాలయ్య బాబు నటించి అవమానపడ్డాడు ఆ విషయం లో ఇప్పటికీ చాలామంది ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు.నిజానికి బాలయ్య బాబు ఎలాంటి సీన్లు చేయాలి అనేది ఎప్పుడూ ఆలోచించడు డైరెక్టర్ ఏం చెబితే అది చేయడమే మన బాధ్యత అనుకొని చేసుకుంటూ వెళ్తాడు.
డైరెక్టర్ ఏం చేయమంటే అది చేసేస్తాడు అలాంటి బాలయ్య బాబు డైరెక్టర్లకు దొరకడం వాళ్ల అదృష్టం అందుకే బాలయ్య బాబు తో సినిమాలు చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.

ఇక బాలయ్య బాబు సినిమా హిట్ టాక్ వచ్చింది అంటే ఇండస్ట్రీ హిట్ కొట్టే విధంగా ముందుకు దూసుకెళ్తుంది.అయితే పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా( Palnati Brahmanayudu )లో మాత్రం తొడకొడితే కుర్చీలు ముందుకి రావడం, తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లడం లాంటి సీన్లు చేసినందుకు బాలయ్య బాబు ఇప్పటికి కూడా రిగ్రెట్ అవుతూ ఉంటాడు.ఇవన్నీ బాలయ్య బాబు మిస్టేక్స్ కావు ఆ సినిమా డైరెక్టర్స్ యొక్క మిస్టేక్స్ అంతే…అయితే ఈ సీన్ మీద రీసెంట్ గా ఈ సినిమస్పందిస్తూ ఆ సీన్ బాలయ్య బాబు చేత చేయించడం నా తప్పు ఎందుకంటే ఆయన నేను ఏం చెప్తే అది చేస్తాడు డైరెక్టర్లకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అంటూ చెప్పాడు.








