సినిమా ఇండస్ట్రీ( Tollywood )లో సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయాలంటేనే కష్టం తో కూడుకున్న రోజులు ఇవి…అలాంటిది స్టార్ హీరోల సినిమాలు అయితే మరీ దారుణం ఒక్కొక్కరు సంవత్సరం, రెండు సంవత్సరాలు ఒక సినిమా కోసమే కేటాయించడం జరుగుతుంది.ఇక ఇలాంటి స్టార్ హీరోలు ఉన్న సమయంలో సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గంగనం గా మారిన ఈ రోజుల్లో కొందరు హీరోలు మాత్రం రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

కానీ ఒకప్పుడు ఒక హీరో ఏకంగా 18 సినిమాలను ఒకే సంవత్సరం లో రిలీజ్ చేసి ఓ సరికొత్త రికార్డుని క్రియేట్ చేశాడు ఆ హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ కృష్ణ( super star krishna ).1972 వ సంవత్సరంలో ఆయన ఏకంగా 18 సినిమాలను రిలీజ్ చేసి ఆ ఇయర్ అత్యధిక సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా చరిత్ర సృష్టించాడు.ఆ రికార్డును ఇప్పటి వరకు బ్రేక్ చేసిన హీరో కూడా ఎవరూ లేరు.ఒక సంవత్సరంలో 18 సినిమాలు అంటే దాదాపుగా 20 రోజులకు ఒక సినిమాని రిలీజ్ చేసినట్టు అన్ని సినిమాలు రిలీజ్ చేయాలంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు.

సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికి మన హీరోలు, డైరెక్టర్లు నానా తంటాలు పడుతుంటే మన స్టార్ హీరోల ఎంటైర్ కెరియర్ లో చేసే సినిమాలు మొత్తం ఆయన ఒక సంవత్సరం లోనే చేసేసాడు.అప్పుడు ఆయన మూడు షిఫ్ట్ లు చేస్తూ సినిమాలు చేసేవారని ఇండస్ట్రీలో చాలామంది చెప్తూ ఉంటారు.అందుకే ఆయన 350 కి పైన సినిమాల్లో హీరోగా నటించిన సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు… కృష్ణ తీసిన చాలా సినిమాలో అప్పట్లో మంచి విజయాలను కూడా అందుకున్నాయి…








