2024 ఎన్నికలను వైసీపీ ( YCP ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.ముఖ్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఇంకా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కొన్ని నెలల క్రితం నుండి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పలు సర్వేలు చేసుకుని వాటి ఫలితాలు ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నారు.
ఇప్పటికే ఈ రకంగా సర్వేలు ఫలితాల ఆధారంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ.అసెంబ్లీ స్థానాలకు అదే విధంగా పార్లమెంటు నియోజకవర్గల ఇంచార్జ్ లను మారుస్తున్నారు.ఈ రకంగా ఇప్పటివరకు ఐదు జాబితాల వారీగా 61 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు, 14 పార్లమెంట్ స్థానాలకు వైసీపీ అధిష్టానం ఇన్చార్జిలను మార్చడం జరిగింది.
తాజాగా ఆరో జాబితా విడుదల( Release of sixth list ) చేయడం జరిగింది.ఈ జాబితాలో పది స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తూ లిస్టు రిలీజ్ చేశారు.
ఈ పది స్థానాలలో నాలుగు పార్లమెంటు నియోజకవర్గం అయితే మిగతా ఆరు స్థానాలు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించినవి.
వైసీపీ ఆరో జాబితా పూర్తి వివరాలు:-
రాజమండ్రి ఎంపీ- గూడూరి శ్రీనివాస్, నరసాపురం ఎంపీ- గూడూరి ఉమాబాల గుంటూరు ఎంపీ – ఉమ్మారెడ్డి రమణ, చిత్తూరు ఎంపీ- రెడ్డప్ప గిద్దలూరు ఎమ్మెల్యే- నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీ- ఎండీ ఖలీల్ జీడీ నెల్లూరు – కె.నారాయణ స్వామి, ఎమ్మిగనూరు- బుట్టా రేణుక మైలవరం – తిరుపతిరావు, మార్కాపురం- రాంబాబు