కాంగ్రెస్ పార్టీ అబివృద్ధి కోసం పని చేస్తున్న సీనియర్ లకు తగిన గుర్తింపు ఉంటుంది

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) :కాంగ్రెస్ పార్టీ అబివృద్ధి కోసం మొదటి నుంచి పార్టీ ని నమ్ముకొని పని చేస్తున్న సీనియర్ లకు తగిన గుర్తింపు ఉంటుందని పిసిసి అధికార ప్రతినిధి మీడియా కమ్యూనికేషన్ చైర్మన్సామ రాంమోహన్ రెడ్డి అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజిరెడ్డి ఆహ్వానం మేరకు శుభ కార్యక్రమానికి పిసిసి అధికార ప్రతినిధి మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్ మోహన్ రెడ్డి( Sama Ram Mohan Reddy ) హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను తో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు.సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి ఓటమికి గల కారణాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తల తో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం జరుగుతుందని చేరికల ను తాను కూడా స్వాగతిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోకల్ గా కాంగ్రెస్ పార్టీలో( Congress party ) చేరికలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్వాగతించాలన్నారు, వ్యతిరేకించవద్దని కాంగ్రెస్ పార్టీని మరింత అభివృద్ధి చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు నాయకులు ఇంకా అవసరమేనన్నారు.

అందరూ కలిసి పనిచేస్తేనే గెలుపు లక్ష్యం నెరవేరుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యత సీనియర్లకు కొత్తవారికి ఇచ్చే ప్రాధాన్యత కొత్తవారికి ఇస్తుందన్నారు.

Advertisement

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య , జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి , కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి , మాజీ జడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడి రామ్ రెడ్డి , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్, కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ , బీసీ సెల్ మండల అధ్యక్షులు రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు రాములు , బండారి బాల్ రెడ్డి , గంట బుచ్చాగౌడు, పందిళ్ళ సుధాకర్ గౌడ్,మెండె శ్రీ నివాస్ యాదవ్, మోతుకు బాల్ చందర్ జంగా శ్రీకాంత్ రెడ్డి ,గ్రామ శాఖ అధ్యక్షులు కిష్టారెడ్డి, తిరుపతిరెడ్డి, గణేష్ నాయక్ , బాలయ్య , మాజీ ఎంపీటీసీ సభ్యులు తడకల దేవరాజు కొత్తపల్లి నరసింహులు సాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు,.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని అమ్మి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..
Advertisement

Latest Rajanna Sircilla News