అనసూయతో సీటీమార్ డైరెక్టర్ సినిమా..!

స్క్రీన్ ఏదైనా సరే తన సత్తా చాటిస్తున్న అనసూయ ఇపుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్టు తెలుస్తుంది.

ఓ పక్క బుల్లితెర మీద తన జబర్దస్త్ యాంకరింగ్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం తనదైన శైలిలో విలక్షణమైన పాత్రలు చేస్తూ అలరిస్తుంది.

క్షణం నుండి రాబోతున్న పుష్ప సినిమా వరకు అనసూయ స్పెషల్ రోల్స్ చేస్తుందని తెలుస్తుంది.ఇక లేటెస్ట్ గా సీటీమార్ డైరక్టర్ సంపత్ నంది తో అనసూయ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

సీటీమార్ సినిమాతో సత్తా చాటిన సంపత్ నంది తన ప్రొడక్షన్ లో ఒక వెబ్ మూవీ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో లీడ్ రోల్ లో అనసూయని సెలెక్ట్ చేశారట.

ఇప్పటికే సంపత్ నంది తన ప్రొడక్షన్ లో బ్లాక్ రోజ్ సినిమా చేస్తున్నాడు.బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతులా ఆ సినిమాలో నటిస్తుంది.

Advertisement

ఇక ఇప్పుడు అనసూయ లీడ్ రోల్ తో మరో వెబ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.ఈమధ్యనే థ్యాంక్ యు బ్రదర్ అంటూ ఒక సినిమా చేసిన అనసూయ సంపత్ నందితో ఎలాంటి సినిమా చేస్తుందో చూడాలి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు