తెలంగాణలో గడీల పాలనే కొనసాగుతోంది.. : భట్టి

ఖమ్మం సభ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి సభను సక్సెస్ చేశారని తెలిపారు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకున్నానని పేర్కొన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

సైంటిఫిక్ టెంపరమెంట్ తో రాష్ట్రాన్ని పాలకులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా పునర్నిర్మాణం చేస్తున్నామని చెబుతూ గతంలో నాటి గడీల పాలననే కొనసాగిస్తున్నారని విమర్శించారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు