సాధారణంగా కొందరికి తలలో విపరీతమైన దురద( Itching in the head ) ఉంటుంది.దీని కారణంగా చేతులు ఎప్పుడు చూసినా తలలోనే ఉంటాయి.
జుట్టు చిందరవందరగా తయారవుతుంటుంది.తలలో దురద వల్ల చేసే పనిపై అస్సలు శ్రద్ధ చూపలేకపోతుంటారు.
హెయిర్ ఆయిల్ ను ఎవైడ్ చేయడం, చుండ్రు, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, వర్షాల్లో తరచూ తడవడం, తదితర కారణాల వల్ల తలలె విపరీతమైన దురద పడుతుంటుంది.
అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఆగమాగం అయిపోతుంటారు.కానీ వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీ కోసమే.
ఈ రెమెడీని పాటిస్తే తలలో ఎలాంటి దురదైనా దెబ్బకు మాయం అవుతుంది.మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు ( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ), వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు( turmaric ), రెండు రెబ్బల వేపాకు వేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.వాటర్ కొంచెం థిక్ గా మారిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేయాలి.ఆపై ఈ వాటర్ ను స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేసి అరగంట పాటు వదిలేయాలి.
అనంతరం అదే వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా చేస్తే తలలో దురద అన్న మాటే అనరు.కారణం ఏదైనా ఈ రెమెడీని కనుక పాటిస్తే తలలో దురద దెబ్బకు మాయం అవుతుంది.అలాగే చుండ్రు సమస్య ఉన్నా కూడా తొలగిపోతుంది.
జుట్టు సిల్కీగా, షైనీగా మెరుస్తుంది.కాబట్టి తలలో తీవ్రమైన దురద సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
బెస్ట్ రిజల్ట్ ను మీరు గమనిస్తారు.