ఇదే కొంప ముంచిందిగా పెద్దాయన !

తమకు ఎదురే లేదు అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ( BRS party ) హవ తెలంగాణలో కనిపించేది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.

అయితే మూడోసారి మాత్రం బీఆర్ఎస్ కు ఘోర పరాజయమే ఎదురయింది.ఊహించిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను అధికారంలోకి తీసుకువస్తాయని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ భావించారు.తాము తప్ప తెలంగాణను పాలించేందుకు ఎవరికి అర్హత లేదు అన్నట్లుగా వ్యవహరించారు.

అయితే గెలుపుపై అతి ధీమా ఏర్పడడం,  కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరు ఇవన్నీ బీఆర్ఎస్ ఓటమికి కారణం అయ్యాయి.

Advertisement

కాంగ్రెస్ ( Congress )అధికారంలోకి రావడానికి ఆ పార్టీపై జనాల్లో ఉన్న సానుకూలత కంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత కాంగ్రెస్ కు ఈ స్థాయిలో విజయాన్ని తీసుకొచ్చాయి అని చెప్పడంలో సందేశం లేదు.తెలంగాణలో భూములకు సాగునీరు అందించడం , దళితులు,  బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం , జిల్లాల విభజన, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు,  దళితులు మైనారిటీలు బీసీల కోసం ప్రత్యేక పథకాలను ఏర్పాటు చేయడం ఎలా ఎన్నో కేసీఆర్( KCR ) అమలు చేశారు.  అయితే ఎన్నికల్లో అవేవీ కాపాడలేకపోయాయి.

ముఖ్యంగా బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది .

 సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్ ప్రజాప్రతినిధులకు అప్పగించడం,  ఇక కెసిఆర్ సైతం ప్రజలకు,  పార్టీ ఎమ్మెల్యేలు నాయకులకు అందుబాటులో ఉండకపోవడం,  ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వంటివి కెసిఆర్ కు నష్టలే తీసుకొచ్చాయి.  గత కొంతకాలంగా కేసీఆర్ వ్యవహార శైలి తెలంగాణ ప్రజలకు ఆగ్రహాన్ని కలిగించింది.ఇదే అదునుగా దొరల పాలన అంటూ విపక్షాలు పెద్ద ఎత్తున జనాల్లో వ్యతిరేకత పెంచడం ఇవన్నీ బీఆర్ఎస్ ఓటమికి కారణాలు గానే చెప్పవచ్చు.

ఇక అప్పుడప్పుడు కేసీఆర్ ప్రసంగాల్లో ఇతరులను చులకన చేసే విధంగా మాట్లాడిన మాటలు , గెలుపు పై పెరిగిన అతి ధిమా ఇవన్నీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించి,  కారు పార్టీని షెడ్ కు పంపేలా చేశాయి.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు