ఇదేందయ్యా ఇది.. కేవలం ఆరడుగుల ప్రదేశంలో దంచికొట్టిన వాన.. వీడియో వైరల్..

గత కొన్ని రోజులుగా నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలో అనేక ప్రాంతాలలో వర్షాలు బాగా పడుతున్నాయి.

ఈ సమయంలోనే తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదునున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఏ సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో కూడా అంచనా వేయలేకపోతున్నారు అధికారులు.భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నిండుకుండలాగా కనపడుతున్నాయి.

ఈ క్రమంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు తెగ భయపడిపోతున్నారు.ఎక్కడ ఏ మ్యాన్ హోల్( Man hole ) ఉందో అని అడుగులో అడుగు వేసుకుంటా ప్రజలు గడిపేస్తున్నారు.

హైదరాబాద్( Hyderabad ) మహానగరం లాంటి సిటీలలో ఒక ప్రాంతంలో వర్షం పడితే మరో ప్రాంతంలో వర్షం పడదు.అయితే, తాజాగా ఓ వింత అనుభవం హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.ఇక ఘ్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

వైరల్ గా మారిన వీడియోలో.కేవలం ఆరు అడుగులలో మాత్రమే వర్షం కురవడం గమనించ వచ్చు.హైదరాబాద్‌ లోని మురద్‌ నగర్( Murad Nagar ) పోస్టాఫీస్ సమీపంలో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది.

ఒక గల్లీలో ఒకవైపు మాత్రమే వర్షం కుండపోతగా పడుతుండగా.మరో వైపు మాత్రం ఒక చుక్క వర్షపు నీరు కూడా పడకపోవడాన్ని వీడియోలో గమనించవచ్చు.కేవలం ఆరడుగుల ప్రదేశంలో మాత్రమే జోరుగా వాన కురువాదం మనం గమినించవచ్చు.

ఈ వింత వర్షాన్ని చూసి స్థానికులు ఆశ్చర్య పోయే ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా( Social media)లో పోస్ట్ చేసారు.ఇక వీడియో చూసిన నెటిజన్స్ తామెప్పుడూ ఇలాంటి వర్షాన్ని చూడలేదని వారు చెబుతున్నారు.

ఇక వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది.కొన్నిరోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్న పరిస్థుతులలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బైటకు రావొద్దని తెలిపింది.

మొదటిసారి బయటకు వచ్చిన పవన్ చిన్న కూతురు.. వైరల్
Advertisement

తాజా వార్తలు