విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి లో కొండచిలువ కలకలంరేపింది.నక్కపల్లి మండలం, చుక్కల వాని లక్ష్మీపురం గ్రామంలో ఏకంగా ఓ మేకను మింగేసింది.
కొండచిలువ మేకను మింగేసి ఇబ్బందిపడింది.కొంతమంది స్థానికులు గుర్తించి కొండ చిలువ ను చంపేశారు.
అనంతరం మేకను బయటకు తీశారు.కొండ చిలువను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.
ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.ఈ కొండచిలువ ఎక్కడి నుంచి వచ్చిందోనని స్థానికులు టెన్షన్ పడుతున్నారు.
మేకను మింగింది కాబట్టి సరిపోయిందని.అదే చిన్ని పిల్లలు అక్కడే ఉంటే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.