దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా రూపొంది గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా కు మంచి వసూళ్లు నమోదు అయిన విషయం తెలిసిందే.ఆ సినిమా కు వచ్చిన కలెక్షన్స్ తో చిత్ర యూనిట్ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు.
తమిళం మరియు మలయాళంలో విడుదల అయిన సీతారామం సినిమాని ఇప్పుడు హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటికే హిందీలో డబ్బింగ్ మొదలు పెట్టినట్లుగా సినీ వర్గాల సమాచారం.
తెలుగు తో పాటు హిందీ లో కూడా ఒకే సారి విడుదల చేసి ఉంటే మంచి ఆదరణ దక్కేది.గతం లో విడుదలైన తెలుగు సినిమా లు హిందీ లో మంచి విజయాలని సొంతం చేసుకున్నాయి.
ప్రస్తుతం కార్తికేయ 2 కూడా ఇక్కడ అక్కడ ఒకేసారి విడుదలై ప్రస్తుతం అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.కనుక తెలుగుతో పాటు హిందీలో కూడా సీతారామం సినిమాని విడుదల చేసి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.
ఇప్పుడు అక్కడ ప్రత్యేకంగా ప్రమోషన్ చేయడం మరియు విడుదల చేయడం అనేది చాలా పెద్ద ప్రహసనం.అందుకే సినిమా విడుదల బాధ్యతలను పూర్తిగా మరో సంస్థ కి వైజయంతి మూవీస్ వారు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
వారు సినిమా విడుదలకు సంబంధించిన అన్ని విషయాలను ఉత్తర భారతం లో చూసుకుంటున్నారట.ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకోవడంతో అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగు తో పాటు ఇతర సౌత్ బాషలో విడుదలై భారీ వసూలను నమోదు చేసిన ఈ సినిమా మరింతగా అక్కడ వస్తువులను సాధిస్తుందేమో చూడాలి.ఇక్కడి కలెక్షన్స్ తో సంతృప్తి చెందని తెలుగు నిర్మాతలు అక్కడ కూడా విడుదల చేసి మరిన్ని కలెక్షన్స్ ని పొందాలని ఆశపడుతున్నట్లుగా టాక్ నడుస్తుంది.
ఒకవేళ అక్కడ కూడా హిట్ అయితే పాతిక కోట్ల వరకి వసూలు నమోదు అయ్యే అవకాశం ఉంది అని బాక్సాఫీస్ వర్గాల వారు ధీమాతో చెబుతున్నారు.ఏం జరగబోతుందో హిందీలో విడుదల అయితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.







