మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా నటించిన కూడా ఆచార్య సినిమా ను కాపాడలేక పోయాడు.
తండ్రి కొడుకులు నటించిన సినిమా అవడం తో ఆచార్య పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా వచ్చాయి.కానీ దర్శకుడు కొరటాల శివ అంచనాలను అందుకోవడంలో బొక్కబోర్లా పడ్డాడు.ఆచార్య సినిమా డిజాస్టర్ టాక్ దక్కించుకుంది.100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య కనీసం 40 కోట్ల వసూళ్ల ను వెనక్కు రాబట్ట లేక పోయింది.సినిమాకు దాదాపుగా 65% వరకి నష్టాలు మిగిలినట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ దర్శకుడి వల్ల తాను నష్టపోయాను అంటూ ఆచార్య సినిమా గురించి పేరు ఎత్తకుండా ప్రస్తావించాడు.
చిరంజీవి ఆచార్య సినిమా గురించి ఆ వ్యాఖ్యలు చేశాడని ప్రతి ఒక్కరు బలంగా నమ్ముతున్నారు.దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను నిండా ముంచాడు అనేది మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయంగా ఆ మాటలను బట్టి అర్థమవుతుంది.
అయితే కొందరు కొరటాల శివ సన్నిహితులుగా చెప్పుకుంటున్న వారు మెగా కాంపౌండ్ వారు చేసిన మార్పుల వల్లే ఆచార్య సినిమా ఫ్లాప్ అయిందని అంటున్నారు.రామ్ చరణ్ పాత్రను పెంచాలి పెంచాలి అంటూ భారీగా పెంచి అసలు కథను పక్క దోవ ప్రకటించారు.
అలా ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు ఆచార్య సినిమా యొక్క ఫ్లాప్ ని దర్శకుడు కొరటాల శివ మీదికి నెట్టడం ఏమాత్రం బాగాలేదని ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ విజయాలను సొంతం చేసుకున్నా ఆచార్య సినిమా ఒక్కటే నిరాశపర్చడానికి కారణం ఏంటో ప్రేక్షకులు ఆలోచిస్తారంటూ ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని, ఆయన గొప్ప నటుడు ఆయన కెరియర్ లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాడు.ఆచార్య పరాజయం వెనుక ఉన్నది ఎవరో ఆయన కాస్త ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







