విశాఖపట్నంలోని గంగవరం పోర్టు కార్మికుల సమస్య తాత్కాలికంగా సద్దుమణిగిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తొమ్మిది డిమాండ్లతో మరోసారి యాజమాన్యంతో కార్మిక సంఘాలు చర్చలు జరిపారు.
ఈ మేరకు చర్చలకు కార్మిక సంఘాలు వారం రోజుల సమయం ఇచ్చాయి.మరోవైపు డిమాండ్లు నెరవేరే వరకు కార్మికుల పక్షానే ఉంటామని అఖిలపక్ష పార్టీ నేతలు వెల్లడించారు.
అయితే ముందు యాజమాన్యం చేసిన ప్రతిపాదనలను కార్మికులు తిరస్కరించిన సంగతి తెలిసిందే.కాగా పోర్టు వద్ద కార్మికుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.