2023 సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే నిర్మాతలకు లాభాలను అందించాయి.ఈ సినిమాలు అందించిన లాభాల వల్ల నిర్మాతలకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలిగింది.
సినిమాల థియేట్రికల్ కలెక్షన్ల ద్వారా ఈ సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం.ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో లాభాలను అందించిన సినిమాగా వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) నిలిచింది.
చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు ఏకంగా 46 కోట్ల రూపాయల లాభాలను అందించిందని సమాచారం.వాల్తేరు వీరయ్య మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కినా కంటెంట్ అద్భుతంగా ఉండటం వల్ల ఈ సినిమా సులువుగా బ్లాక్ బస్టర్ హిట్ కావడం సాధ్యమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ జాబితాబో తర్వాత స్థానంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటించిన బేబీ మూవీ( Baby Movie ) నిలిచింది.

చిన్న సినిమాగా విడుదలైన బేబీ మూవీ పెద్ద విజయం సాధించగా ఈ సినిమాకు ఏకంగా 35 కోట్ల రూపాయల లాభం వచ్చిందని సమాచారం.ఈ సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే బేబీ నిర్మాతలకు ఏకంగా 35 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని సమాచారం.ధనుష్, సంయుక్త కాంబోలో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సార్ మూవీకి( Sir Movie ) 25 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా లాభాలు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సార్ సినిమా అందించిన స్థాయిలోనే విరూపాక్ష మూవీ( Virupaksha Movie ) కూడా లాభాలను అందించిందని తెలుస్తోంది.నాని దసరా సినిమా( Dasara Movie ) 12 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లాభాలను అందించగా బలగం, సామజవరగమన సినిమాలు 11 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలను అందించడం గమనార్హం.ఈ సినిమాలను నిర్మించిన నిర్మాతలు ఈ సినిమాల లాభాల విషయంలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.







