ఆ మేక ధర అక్షరాలా రూ.70 లక్షలు!

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి."నా మేక ధ‌ర అక్ష‌రాలా రూ.

70 ల‌క్ష‌లు.అంత‌కు మించి ఒక్క రూపాయి కూడా తగ్గించను!" అని బేరం పెట్టాడు ఆ మేక యజమాని.ఈ మేక‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్ అనుప్పూర్ కు చెందిన వాహిద్ హుస్సేన్ అనే వ్య‌క్తి మార్కెట్లో అమ్మేందుకు తీసుకొచ్చి, రూ.70 ల‌క్ష‌ల ధ‌ర‌ను నిర్ణ‌యంచాడు.అయితే అంత ప్రత్యేకత అందులో ఏముందనేగా మీ అనుమానం.

దానికి అనేక కారణాలు చెబుతున్నాడు ఆ యజమాని.ఆ మేక ప్ర‌కృతి ఇచ్చిన వార ప్ర‌సాదం అని చెబుతున్నాడు.

అలాగే ఇది స్వ‌దేశీ జాతికి చెందిన‌ది.ఇక దీని శ‌రీరంపై ఉర్దూలో అల్లా, మ‌హ‌మ్మ‌ద్ అని రాసి వుండటమే దీని ప్రత్యేకత అట.ఆ కారణం చేత దీని ధ‌ర‌ను రూ.70 ల‌క్ష‌లుగా ఫైన‌ల్ చేశాన‌ని ఆ యజమాని చెబుతున్నాడు.ఈ మేక ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన తరువాత నాగ‌పూర్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఫోన్ చేసి దీనిని రూ.22 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేస్తాన‌ని అన్నారట.అయితే దానికి అతగాడు ఒప్పుకోలేదట.

Advertisement

ఆ ఖ‌రీదుకు నేను మేక‌ను ఇవ్వనని, 70 లక్షలకు అణాపైసా కూడా తగ్గేది లేదని ఆ యజమాని ఎక్కడా తగ్గట్లేదు.అతగాడు దానికి ఎంతో విలువైన ఆహారం రోజూ తినబెడుతున్నాడట.

జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా..

వగైరా తినిపిస్తున్నాడట.

అయితే అంత ప్రత్యేకత కలిగిన మేకను ఎందుకు అమ్మేసుకోవడం అని కొంతమంది ప్రశ్నించగా, "ప్ర‌స్తుతం నా కుటుంబ ఆర్థిక ప‌రిస్థితులు ఏమి బాలేదు.నాకు మొత్తం 6గురు పిల్ల‌లున్నారు.వారిలో ముగ్గురు ఆడ పిల్ల‌లున్నారు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైలు..?

ఈ మేక‌ను అమ్మిన డ‌బ్బుతోనే నేను వారి పెళ్లిళ్లు చేయాలి.నాకు వేరే దిక్కు లేదు.

Advertisement

" అని చెప్పుకొచ్చాడట.ఇదే వింత అనుకుంటే.

మధ్యప్రదేశ్​.అగర్ మాల్వా మార్కెట్లో రూ.11 లక్షల విలువైన మేక అమ్మకానికి వచ్చింది.దీని ప్రత్యేకత కూడా అలాగే వుంది.

వాటి శరీరంపై అల్లా, మహమ్మద్ అనే ఉర్దూ పేర్ల గుర్తులు ఉండటమే వాటికి అంత డిమాండ్.వీటికి ఇంత డిమాండ్ ఉండటంతో ఈ మేకలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు.

తాజా వార్తలు