అమెరికాలో 14 ఏళ్ళ బాలికపై కేసు నమోదు చేసిన పోలీసులు...ఎందుకంటే...

అమెరికాలో తన తోటి పిల్లలకు డబ్బులు పంచి పెట్టిందనే కారణంతో 14 ఏళ్ళ బాలికపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

అయితే డబ్బులు పెంచితేనే అరెస్టులు చేసేస్తారా, ఇదేం ఘోరం అంటూ నెటిజన్లు మాత్రం సదరు పోలీసులకు తిట్టిపోస్తున్నారు.ఇంతకీ అసలేం జరిగింది, డబ్బులు పంచితేనే అరెస్ట్ చేసేస్తారా.

ఈ సంఘటనకు చెందిన పూర్తి వివరాలలోకి వెళ్తే.అమెరికాలోని ఫ్లోరిడా కు చెందిన 14 ఏళ్ళ బాలిక మెరియన్ కౌంటీ లో నివాసం ఉంటోంది.

అక్కడికి దగ్గరలోని లేక్ వేఇర్ వడ్డన ఉన్న మిడిల్ స్కూల్ లో చదువుకుంటోంది.ఎప్పుడూ అల్లరిగా, చలాకీగా ఉండే ఈ బాలిక ఒక రోజు తన స్కూల్ బ్యాగ్ నిండా డబ్బును తీసుకువచ్చింది.

Advertisement

తీసుకువచ్చిన డబ్బును అదే పనిగా తన తోటి పిల్లలకు పంచడం మొదలు పెట్టింది.ఈ విషయం కాస్తా స్కూల్ యాజమాన్యానికి తెలియడంతో బాలికను చేస్తున్న పనిని ఆపమని చెప్పి ఆమెను తనిఖీ చేశారు.

దాంతో ఆమె బ్యాగ్ లో ఇంకా సుమారు 25౦౦ డాలర్లు దొరికాయి.అసలు ఇంత డబ్బు నీకు ఎలా వచ్చింది, ఎందుకు అందరికి పంచుతున్నావని ప్రశ్నించగా ఆమె నుంచీ సమాధానం దొరకలేదు.

ప్రిన్సిపాల్ వచ్చి ఆమెను గట్టిగా నిలదీయడంతో ఈ డబ్బును ఇదే స్కూలో లో గతంలో చదువుకున్న ఓ విద్యార్ధి ఇచ్చారని అందరికి ఇవ్వమని చెప్పినట్టుగా బాలిక తెలిపింది.అయితే ఆమె చెప్పిన రీజన్ సరైనది కాదని గ్రహించిన ప్రిన్సిపాల్ పోలీసులకు విషయం చెప్పడంతో పోలీసులకు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది.తమ బామ్మ 13000 వేల డాలర్లు దాచుకుందని ఆ సొమ్ము మొత్తాన్ని తాను దొంగిలించి పిల్లలకు పంచేస్తున్నానని తెలిపింది అయితే పిల్లలకు ఎందుకు పంచుతున్నాను అనే విషయం మాత్రం బాలిక వెల్లడించలేదు.

ఈ ఘటనతో స్థానిక పోలీసులు బాలికపై కేసు నమోదు చేసి తల్లి తండ్రులకు సమాచారం అందించారు.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు