జగన్ పై 'రాయి ' దాడి కేసు .. నిందితుడిని గుర్తించిన పోలీసులు !?

వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై విజయవాడలో రాయి దాడి జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు.

ఈ మేరకు కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని దాడికి పాల్పడిన యువకుడిని గుర్తించినట్లు సమాచారం.సింగ్ నగర్ కు చెందిన వ్యక్తే ఈ రాయి దాడికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో వెళ్లడైంది.

మొత్తం ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా, దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలను వెల్లడించారట.సిసిఎస్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మొత్తం ఐదుగురులో ఒక యువకుడు జగన్ పై రాయి దాడికి పాల్పడినట్లు సమాచారం.దాడి జరిగిన సమయంలో ఈ ఐదుగురు యువకులు వివేకానంద స్కూల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

వీరిని చారిస్తున్నారు.

ఫుడ్ పార్క్ మీద వినియోగించే టైల్స్ కు వినియోగించే రాయిని దాడికి ఉపయోగించినట్లు ఆ యువకుడు పోలీసులకు చెప్పాడట.ఈ రాయి సూదిగా ఉండడంతో పాటు, గాయం కూడా తగిలే అవకాశం ఉండడంతో దానిని ఆ యువకుడు ఉపయోగించినట్లు చెబుతున్నారు.అజిత్ సింగ్ నగర్ ఫ్లై ఓవర్ సమీపంలో ఫుట్ పాత్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వాడే టైల్స్ ను దాడికి వినియోగించినట్లు తెలుస్తోంది.

అధికారికంగా ఇంకా పోలీసులు ఏ విషయాన్ని ప్రకటించకపోయినా, ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ప్రాంతాన్ని గుర్తించారు.

ప్రస్తుతం అదుపులో ఉన్న ఐదుగురు యువకులు ఎందుకోసం దాడి కి పాల్పడ్డారు ? వెరీ వెనుక ఎవరైనా ఉన్నారా లేక ఆకతాయిగాతనంగా ఈ దాడికి పాల్పడ్డారా అనే విషయంపై సమగ్రంగా వేచారణ చేస్తున్నారు.రాయిని జేబులో వేసుకుని జగన్ పర్యటించే ప్రాంతంలో ఉన్న వివేకానంద స్కూల్ కు చేరుకున్న యువకుల బృందం లో ఒకరు ఈ దాడి కి పాల్పడినట్లుగా తేలడంతో దీనిపై మరింతగా దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.

దండం పెడతాను నన్ను వదిలేయండి...పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన రేణు దేశాయ్!
Advertisement

తాజా వార్తలు