ముక్కు పుడకను మింగేసిన వ్యక్తి.. ఆ విషయమే తెలియదంటున్న రోగి

కొంత మందికి ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వారికి ఏం వ్యాధి ఉందో తెలియక డాక్టర్లు తికమక పడుతుంటారు.

ఒక్కోసారి ఏవైనా ఎక్స్‌-రేలు, టెస్టులు చేసినప్పుడు అసలు విషయం బయటపడుతుంది.

తీరా అసలు విషయం రోగులు సైతం అవాక్కవుతుంటారు.వారి గొంతులోనో, కడుపులోనో, ఊపిరితిత్తులలోనో ఏవైనా వస్తువులు బయట పడుతుంటాయి.

ఇది తమకు సైతం తెలియదని వారు చెప్పడం వైద్యులను ఆశ్చర్యపరుస్తుంది.తాజాగా ఇలాంటి ఓ ఘటన జరిగింది.

తరచూ దగ్గుతో బాధపడుతూ ఆసుపత్రికి ఓ వ్యక్తి వెళ్లాడు.అతడికి న్యుయోనియా ఉందని వైద్యులు భావించారు.

Advertisement

అయితే అనుమానంతో ఎక్స్-రే తీయగా అందులో ఉన్నది చూసి ఖంగుతిన్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అమెరికాకు చెందిన జాయ్ లైకిన్స్ అనే వ్యక్తికి ఫ్యాషన్‌గా ఉండడం ఇష్టం.ఇతర కుర్రాళ్లలాగే అతడు కూడా ముక్కు పుడకను పెట్టుకున్నాడు.

దానిని చూసి మురిసి పోయాడు.అయితే హఠాత్తుగా ఓ రోజు నిద్ర లేవగానే అది కనిపించలేదు.

ఎక్కడో పోయి ఉంటుందని భావించాడు.కొన్నాళ్లకు దాని విషయం మర్చిపోయాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

కొంత కాలంగా అతడికి ఛాతీలో నొప్పి తీవ్రంగా వస్తోంది.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రికి పరుగులు తీశాడు.

Advertisement

తరచూ దగ్గు వస్తోందని, ఇతర వ్యాధి లక్షణాలను డాక్టరుకు ఏకరువు పెట్టాడు.

అయితే వైద్యులు ఎందుకైనా మంచిదని ఎక్స్-రే తీయించారు.తీరా అది వచ్చాక వారికి అసలు విషయం అర్ధమైంది.అతడి ఊపిరితిత్తుల్లో 0.6 అంగుళాల ఉండే ముక్కు పుడక ఇరుక్కు పోయిందని చెప్పారు.శస్త్ర చికిత్స చేసి దానిని బయటకు తీశారు.

దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.అయితే తనకు ముక్కు పుడక పోయిందని అభిప్రాయం ఉండేదని, అందుకే పట్టించుకోలేదని అతడు చెప్పాడు.

అంతేకాకుండా తాను ఎప్పుడు అది మింగానో తనకే తెలియదని చెప్పడంతో డాక్టర్లు కంగుతిన్నారు.

తాజా వార్తలు