ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 23 అక్టోబర్ 5 నుంచి వాజయవంతంగా ప్రారంభం కాబోతోంది.నవంబర్ 19న ఫైనల్ జరగనుందనే విషయం అందరికీ తెలిసినదే.
ఇక ఆస్ట్రేలియా( Australia )తో అక్టోబరు 8న చెన్నైలో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడబోతోంది.ఈ నేపధ్యంలో ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లు, ఆసియా కప్‌లో రోహిత్ సేనకు అనేక అనుమానాలను కలిగిస్తున్నాయని భోగట్టా.
కాగా వాటికి కచ్చితంగా సమాధానం కనుగొనాల్సి ఉంది. వెస్టిండీస్, ఆ తర్వాత ఆసియా కప్ 23, ఆస్ట్రేలియాపై సిరీస్‌లను గెలుచుకున్న తర్వాత, భారత క్రికెట్ జట్టు ఇప్పుడు డైరెక్ట్ గా ప్రపంచ కప్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఇకపోతే, ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ( Rohit Sharma ) తొలిసారిగా టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న విషయం.ఇదే ఇపుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.అవును, 2011 తర్వాత మరోసారి సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలవాలని టీమ్ ఇండియా గట్టిగానే కసరత్తులు చేస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి చరిత్ర పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదని అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు.
వాస్తవానికి అయితే ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ 2023 కి ముందు చాలా ప్రయోగాలు చేయడం వల్ల టీమిండియా అభిమానులు కూడా గందరగోళానికి గురైన పరిస్తితి.

ఇక దీనిని బట్టి అర్ధం చేసుకోవలసినది ఏమిటంటే ప్రపంచకప్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడనున్న టీమ్‌ఇండియాలో ఏ 11 మంది ఆటగాళ్లు ఉన్నారనేది ఇంకా ఖరారు కాకపోవడం.ఎందుకంటే, వెస్టిండీస్ టూర్, ఆ తర్వాత ఆసియాకప్( Asia Cup ), ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌ల సందర్భంగా ‘ప్రయోగానికి’ సరికొత్త ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఇప్పుడు ఫైనల్ 11 మంది టీమ్ ఇండియా ప్రపంచ కప్ ముందు ఆడటానికి బరిలోకి దిగనున్నారు.