దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తోన్న రైతు ఉద్యమం ఇప్పుడు పూర్తిగా రూపు మార్చుకుంది.మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు దాదాపు రెండున్నర నెలల క్రితం ఉద్యమం మొదలైంది.
పంజాబు నుంచి మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు హర్యానా మీదుగా ఢిల్లీ వరకు పాకింది.జనవరి 26న ఢిల్లీలో జరిగిన అల్లర్ల తర్వాత ఈ ఉద్యమం ఆగుతుందని అనుకున్నా… ఇప్పుడు రివర్స్ అయ్యి కేంద్ర ప్రభుత్వాన్నే కాకుండా బీజేపీ నేతల వెన్నులో సైతం వణుకు పుట్టిస్తోంది.
ఈ ఉద్యమంలో పంజాబ్, హర్యాతో పాటు యూపీకి చెందిన యువకులు ఎక్కువుగా ఉంటున్నారు.
ఇక ఈ ఉద్యమంలో సిక్కులే కాకుండా ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్న జాట్ యువకులు ఎక్కువ మంది స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అన్నా.యూపీలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నా అందుకు జాట్లే కీలక పాత్ర పోషించారు.వాళ్లు ఎప్పుడు బీజేపీకి అండగా ఉన్నారు.అలాంటి జాట్లు ఇప్పుడు బీజేపీ అంటేనే మండిపడుతున్నారు.
తమ పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)ని ఓడించి తప్పు చేశామని చెప్పటంతో బీజేపీలోనూ… అటు పార్టీ నాయకత్వంలోనూ వణుకు మొదలైంది.అజిత్ సింగ్ పెట్టిన ఆర్ఎల్డీ నూరుశాతం జాట్ల పార్టీ.

యూపీలోని పశ్చిమ ప్రాంతంలో జాట్ల ప్రాబల్యం చాలా ఎక్కువ.ఈ వర్గంలో పట్టున్న తికాయత్ పిలుపుతో ఇప్పుడు వీరంతా బీజేపీకి వ్యతిరేకం అవుతున్నారు.దీని ప్రభావం యూపీ, హర్యానాపై తీవ్రంగా పడనుంది.ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ భవిష్యత్తులో అధికారానికి దూరం కావడమే కాదు… కేంద్రంలోనూ ఆ పార్టీకి దెబ్బ తప్పేలా లేదు.
రైతుల ఉద్యమం ఎఫెక్ట్‌తో తికాయత్ పిలుపు కారణంగా హర్యానాలో ప్రభుత్వం పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదట.ఇక యూపీ, హర్యానా నేతలు కూడా జాట్ల వ్యూహాలతో తీవ్ర ఆందోళనలో ఉన్న మాట వాస్తవం.