యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘సలార్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను దడదడలాడించేందుకు అటు ప్రభాస్, ఇటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నారు.
ఈ కాంబోలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ షూటింగ్‌ను ఇటీవల ప్రారంభించారు చిత్ర యూనిట్.కాగా తెలంగాణాలోని గోదావరిఖని బొగ్గుగనుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే తొలుత ఈ సినిమా షూటింగ్‌ను కొల్లార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్)లో నిర్వహించాలని చిత్ర యూనిట్ అనుకుంది.కానీ గోదావరిఖని చుట్టూ ఉన్న ప్రాంతాలు సలార్ చిత్ర యూనిట్‌ను ఆకట్టుకోవడంతో వారు ఇక్కడే షూటింగ్ ప్రారంభించాలని చూశారు.
అయితే ఈ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఉండటంతో తమ చిత్ర షూటింగ్‌కు భద్రత కావాలంటూ ప్రభాస్ రామగుండం కమిషనర్ వి.సత్యనారాయణను కోరారు.దీంతో కమిషనర్ సలార్ చిత్ర యూనిట్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.అదే విధంగా ప్రస్తుతం 40 మంది పోలీసుల భద్రత మద్య సలార్ షూటింగ్ జరుగుతోంది.
ఇక ఈ సినిమా షూటింగ్‌లో హీరో ప్రభాస్, హీరోయిన్ శృతి హాసన్‌తో పాటు ఇతర నటీనటులు పాల్గొంటున్నారు.ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ మూవీని హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.
ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2021 చివరినాటికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి సలార్ చిత్రంతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో, ఈ సినిమా ఎలాంటి విజాయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సలార్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.