ఇప్పటంలో కొనసాగుతున్న ఇళ్ల కూల్చివేతల వివాదం

గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇళ్ల కూల్చివేతల వ్యవహారంపై స్పందించిన జనసేన పార్టీ అధినేత బాధిత కుటుంబాలకు రూ.

లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే జనసేనాని చేసిన సాయంపై వ్యతిరేక పోస్టర్లు ఇప్పటంలో దర్శనమిస్తున్నాయి.

దీనిలో భాగంగానే గ్రామంలోని కొన్ని ఇళ్ల బయట తమకు ఎవరి సాయం వద్దంటూ బ్యానర్లు వెలిశాయి.డబ్బులిచ్చి అబద్ధాన్ని నిజం చేయవద్దని, ప్రభుత్వం తమ ఇళ్లు ఏమీ కూల్చలేదని ఫ్లెక్సీలు ఏర్పాటైయ్యాయి.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు