కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకున్న తల్లి.. అసలేమైందంటే

పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర.తన బిడ్డ జీవితంలో మంచి స్థానం సాధించాలని తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తారు.

 The Mother Who Shed Tears Seeing Her Son , The Mother , Viral Latest, News Viral-TeluguStop.com

తమ కనీస అవసరాలు, సరదాలను పక్కన పెడతారు.పిల్లలు ప్రయోజకులు కావాలని తపిస్తారు.

వారు ఉన్నత స్థానంలో స్థిరపడితే సంబరపడిపోతారు.దీని కోసం తమ జీవితం మొత్తం ఎంతో కష్టపడతారు.

అలాంటి ఓ తల్లి తన బిడ్డను పైలట్‌గా చేసేందుకు 30 ఏళ్ల పాటు హౌస్‌కీపింగ్‌గా పనిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.విమానంలో ప్రయాణించేందుకు వెళ్లిన ఆమె పైలట్ యూనిఫాంలో ఉన్న కొడుకును చూసి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ క్షణాన్ని ఎవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో ఈ విషయం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

వృద్ధ మహిళ( old woman ) టికెట్‌ పట్టుకుని ఫ్లైట్‌లోకి వెళ్లడం వైరల్‌ వీడియోలో మనం చూడవచ్చు.గేటు వద్ద నిలబడి ఉన్న ఎయిర్ హోస్టెస్ వారి టిక్కెట్లను తనిఖీ చేస్తుంది.అప్పుడు ఆమె లోపలికి వెళ్ళమని ఆ మహిళకు సూచిస్తుంది.

మొదట కర్టెన్‌ను ఆమె తీసివేస్తుంది.కర్టెన్ తొలగించిన వెంటనే, ఆ మహిళ తన కొడుకు పైలట్ యూనిఫాంలో, చేతిలో ఫ్లవర్ బొకేతో తన ముందు నిలబడి ఉండటం చూస్తుంది.

అప్పుడు ఆ పైలట్ కొడుకు తన తల్లిని కౌగిలించుకుంటాడు.ఇదంతా చూస్తుంటే ఆ మహిళ కళ్లలో ఆనందంతో నీళ్లు తిరిగాయి.ఈ భావోద్వేగ క్షణాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో ఆర్/మేడ్‌మి‌స్మైల్ అనే ఖాతాలో పోస్ట్ చేశారు.‘తన కొడుకును పైలట్‌గా చేయడానికి, అతని చదువులకు నిధులు సమకూర్చడానికి 30 సంవత్సరాలు హౌస్‌కీపర్‌గా పనిచేసిన ఒక మహిళ.ఆమె తన పైలట్ కుమారుడి విమానంలో ప్రయాణించినప్పుడు, ఆమె భావోద్వేగానికి గురై ఏడ్వడం ప్రారంభించింది’ అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.ఇది చూసిన నెటిజన్లు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.

కొడుకు మంచి ఉద్యోగంలో స్థిరపడడం కోసం ఆ తల్లి పడిన కష్టాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube