తెలంగాణలో రాజకీయంగా బిజెపి అష్ట కష్టాలు పడుతోంది. బీఆర్ఎస్ , కాంగ్రెస్( BRS Congress ) లు దూకుడుగా వ్యవహరిస్తుండడం, ఆ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి నెలకొనడంతో , బిజెపి తమ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది .
అయితే పార్టీ నుంచి కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరుతుండడం వంటివి తెలంగాణ బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.ఈ వ్యవహారం ఇలా ఉండగానే పార్టీలో టిక్కెట్ల కేటాయింపు అంశం పెద్ద దుమారాన్నే రేపుతోంది.
దీనికి తోడు ఇప్పుడు జనసేన పార్టీతో పొత్తు వ్యవహారం బిజెపిలో కొత్త చిక్కులు తీసుకువస్తుంది.రెండు పార్టీల మధ్య అధికారికంగా పొత్తు ఖరారు కానప్పటికీ, ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భేటీ కావడం , ఆ తర్వాత కేంద్ర మంత్రి ,తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy )పవన్ కళ్యాణ్ ను కలవడంతో రెండు పార్టీల పొత్తు చిగురిస్తుందని ప్రచారం ఊపు అందుకుంది.

ఈ నేపద్యంలో పొత్తులో భాగంగా తెలంగాణలో జనసేనకు 12 స్థానాలను బిజెపి కేటాయిస్తుందని, అందులో ముఖ్యంగా సెరి లింగంపల్లి , కూకట్ పల్లి నియోజకవర్గలు జనసేనకు కేటాయించబోతున్నట్లుగా తెలడంతో ఈ నియోజకవర్గాల్లో బిజెపి టికెట్ పై ఆశలు పెట్టుకున్న నేతలు ఒకసారిగా ఈ వ్యవహారంపై ఫైర్ అవుతున్నారు.అసలు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బిజెపికి ఏమిటని ? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు నియోజకవర్గాలు జనసేనకు కేటాయించ వద్దంటూ బిజెపి రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళనలకు దిగడం కలకలం రేపుతోంది.సేరి లింగంపల్లి , కూకట్ పల్లి నియోజకవర్గ బిజెపి నేతలు ఉమ్మడిగా కీలక సమావేశాన్ని నిర్వహించుకున్నారు.ఈ రెండు నియోజకవర్గాల ను జనసేనకు కేటాయిస్తే ఊరుకునేది లేదంటూ అధిష్టానానికి హెచ్చరిక కూడా చేశారు.
ఇక మాజీ ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ( Konda Vishweshwar Reddy )సైతం జనసేనకు ఈ నియోజకవర్గలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించవద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు.

కూకట్ పల్లి నియోజకవర్గ టికెట్ జనసేనకు ఇస్తారనే సమాచారంతో అక్కడ బిజెపి టికెట్ ఆశిస్తున్న మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పర్ణాల హరీష్ రెడ్డి( Pannala Harish Reddy ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన అనుచరులతో బిజెపి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.మరోవైపు చూస్తే తెలంగాణలో నామినేషన్లు ప్రక్రియ వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కాబోతోంది.దీంతో టిక్కెట్ల కేటాయింపు విషయంలో బిజెపి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియదుప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఇటలీకి వెళ్లారు.
దీంతో జనసేన , బీజేపీ( Janasena BJP ) పొత్తు పై అధికారికంగా ఏ క్లారిటీ లేదు .కానీ బిజెపి లో టిక్కెట్ ఆశిస్తున్న నేతలు మాత్రం జనసేనకు సీట్లు కేటాయించవద్దనే డిమాండ్లను వినిపిస్తున్నారు.







