మహిళలకు నెలసరి రావడం సాధారణం.పీరియడ్స్ వచ్చిన రోజుల్లో ఎంతో ఇబ్బంది పడుతుంటారు.
దాదాపు 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తుంటాయని వైద్యులు చెబుతుంటారు.ఆ సమయంలో మహిళలు భరించలేని నొప్పితో బాధ పడుతుంటారు.
ఈ సమస్యలేవీ మగవారికి అంతగా పట్టవు.అయితే తనకు ఆ నొప్పి తీవ్రత ఎలా ఉంటుందో తెలుసంటూ ఓ వ్యక్తి చెబుతున్నాడు.
ఎందుకంటే మహిళల తరహాలోనే అతడికి నెలనెలా పీరియడ్స్ వస్తున్నాయి.ఇటీవల ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోగా, వచ్చిన ఫలితాలు చూసి డాక్టర్లే షాక్‌కు గురయ్యారు.
మహిళలకు ఉన్నట్లే అంతర్గత అవయవాలు ఉన్నట్లు తేలింది.ఈ ఆసక్తికర విషయానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన చెన్‌లీ ఇటీవల తనకు కడుపునొప్పి వస్తుండడంతో ఆసుపత్రికి వెళ్లాడు.అతడికి వైద్యులు పలు టెస్టులను వైద్యులు చేయించారు.అయితే వచ్చిన ఫలితాలను చూసి వైద్యులే దిగ్బ్రాంతికి గురయ్యారు.గతంలో అతడు మూత్ర విసర్జన సరిగ్గా కాకపోవడంతో ఆపరేషన్ చేయించుకున్నాడు.
అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మరో ఆసుపత్రిని సందర్శించాడు.అప్పుడు అతడు జన్యుపరంగా మహిళ అని డాక్టర్లు తేల్చారు.
అతడికి లోపల అండాశయం, గర్భాశయం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.అంతేకాకుండా మహిళలకు ఉన్నట్లే పునరుత్పత్తి అవయవాలు కూడా గమనించారు.
చివరికి మూడు గంటల పాటు వైద్యులు శ్రమించి, వాటిని తొలగించారు.ప్రస్తుతం చెన్ లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆపరేషన్ అనంతరం ఈ 33 ఏళ్ల బాధితుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు వెల్లడించారు.







