స్టార్ హీరోయిన్ సాయిపల్లవిని చితక్కొట్టిన తల్లీదండ్రులు.. లెటర్ వల్లే అంటూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవికి సినిమాసినిమాకు ప్రేక్షకులలో క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.సాయిపల్లవి గత సినిమా విరాటపర్వం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

 Interesting Incidents In Heroine Saipallavi Cine Career Details Here Goes Viral-TeluguStop.com

విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా సాయిపల్లవి కెరీర్ ను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

బాల్యంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ను సాయిపల్లవి అభిమానులతో పంచుకున్నారు.ఒక లవ్ లెటర్ వల్ల బాల్యంలో తాను ఇబ్బంది పడ్డానని తాను ఇబ్బంది పడటంతో తల్లీదండ్రులు కొట్టారని ఆమె చెప్పుకొచ్చారు.

నెట్ ఫ్లిక్స్ మై విలేజ్ షోలో పాల్గొన్న సాయిపల్లవి బాల్యంలో తనకు ఎదురైన అనుభవాల గురించి పంచుకున్నారు.నేను ఏడో తరగతి చదివే సమయంలో తల్లీదండ్రులు నన్ను కొట్టారని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

ఏడో తరగతి చదివే సమయంలో ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాశానని సాయిపల్లవి కామెంట్లు చేశారు.అయితే నా తల్లీదండ్రులు ఆ లేఖను చూశారని సాయిపల్లవి వెల్లడించారు.

ఆ సమయంలో పేరెంట్స్ నన్ను చాలా కొట్టారని ఆమె చెప్పుకొచ్చారు.సాయిపల్లవి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సాయిపల్లవి నటించిన గార్గి సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.

Telugu Career Troubles, Show, Netflix, Saipallavi-Movie

సాయిపల్లవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సినిమాసినిమాకు సాయిపల్లవికి క్రేజ్ పెరుగుతుండగా అదే సమయంలో సాయిపల్లవి సక్సెస్ రేట్ మాత్రం అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం.స్టార్ హీరోయిన్ సాయిపల్లవి తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

సాయిపల్లవి ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube