మనిషే బ్లాక్ ఏలియన్‌గా మారాడు... ఎలాగో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

ఎవరి పిచ్చి వారిది కానీ ఈ విషయం తెలిసిన తరువాత మీరు ఆ పిచ్చి పరాకాష్టకు చేరింది అని చెబుతారు.

నేడు యూత్ టాటూ ట్రెండ్‌ ఎలా ఫాలో అవుతున్నారో వేరే చెప్పాల్సిన పనిలేదు.

అలాంటివంటే ఇష్టంలేనివారు కూడా కనీసం ఒక్క టాటూ అయినా తమ ఒంటిమీద పొడిపించుకుంటున్నారు.అయితే టాటూస్ లో అనేక రకాలు ఉన్నాయి.

బేసిగ్గా అవి రెండు మూడు రకాలుగా ఉంటాయి.మొదటి రకం పేర్లను టాటూస్ లాగా వేసుకుంటారు.

తరువాత ఏవైనా సింబల్స్‌ని, అలాగే కొన్ని రకాల డిజైన్స్ ని, లేదా డయాగ్రమ్స్ ని టాటూస్ లాగా వేసుకుంటారు.ఇందులో ముఖ్యంగా పేర్లను యువత తమకు ఇష్టమైనవిగా వేయించుకుంటున్నారు.

Advertisement

అయితే ఒకటి రెండూ వేయించుకోవడం అయితే అది చాలా సర్వసాధారణమైన విషయం అని వదిలేయొచ్చు.కానీ, బాడీ అంతా టాటూస్‌ వేసుకుంటే దాన్ని ఏమనాలి.

పిచ్చి పీక్స్‌కి చేరిందనే చెప్పాలి.అంతేకదా.

ప్రస్తుతం ఇదే కోవకు చెందిన ఒక వ్యక్తి తన బాడీ మొత్తం టాటూస్‌ వేసుకుని బ్లాక్ ఏలియన్గా మారిపోయాడు.దాంతో అతగాడికి ఎక్కడా ఉద్యోగం దొరకడంలేదు.

అందువలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)

వివరాల్లోకి వెళితే, ఆంథోనీ లోఫ్రెడో అనే వ్యక్తి ఒళ్లంతా టాటూలు వేసుకుని ‘బ్లాక్ ఏలియన్’గా మారిపోవాలనుకున్నాడు.అనుకున్నదే తడవుగా.అనేక రకాల బొమ్మలతో కనుబొమ్మలతో సహా తన శరీరంలోని ప్రతీ భాగాన్ని టాటూస్‌తో నింపేసాడు.

Advertisement

ఆఖరికి తలని కూడా వదలలేదు.బోడిగుండు గీసుకొని మరీ తన తలపైన బొమ్మలు చెక్కించుకున్నాడు.

అంతేకాదు.అతని రెండు వేళ్లు, ముక్కు, చెవులు కూడా కట్ చేయబడ్డాయి.

ఫోర్క్‌డ్ ఎఫెక్ట్‌ క్రియేట్ చేసేందుకు నాలుకను మధ్యలోకి స్ల్పిట్ చేసుకున్నాడు.తత్ఫలితంగా అతడు పూర్తిగా ఓ వింతజీవిలాగా మారిపోయాడు.

తాను అనుకున్నట్టుగా బ్లాక్ ఏలియన్ గా అయితే మారిపోయాడు కానీ, దానివలన అతగాడు ఆనందాన్ని మాత్రం పొందటం లేదట!.

తాజా వార్తలు