కుందేలును వేటాడిన చిరుత‌.. ఇంత‌లోనే హీరోలా వ‌చ్చి కాపాడిన అడ‌విపంది!

కొన్నికొన్ని సార్లు ఎంత బ‌ల‌వంతుడైనా త‌న కంటే చిన్న వారికి భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంది.ఇదే విష‌యం జంతువుల్లో కూడా జ‌రుగుతుంటుంది.

చాలామంది అడ‌విలో అస‌లు సింహానికి ఎదురే లేద‌ని అనుకుంటారు.కానీ అలా అనుకుంటే పొర‌పాటే.

ఎందుకంటే కొన్నిసార్లు సింహం కూడా ఇత‌ర జంతువుల‌కు భ‌య‌ప‌డుతుంది.ఇక చిరుత‌పులి కూడా సింహం త‌ర్వాత అంత‌టి రాజ‌సంగా బ‌తుకుతుంది.

దాని వాయువేగానికి ఎవ‌రూ సాటిరారు.అది పంజా విసిరిందంటే ఎంత‌టి జంతువైనా చ‌తికిల ప‌డాల్సిందే.

Advertisement

మ‌రి అంత‌టి బ‌ల‌మైన చిరుత పులి ఈసారి ఓ చిన్న జంతువుకు గ‌జ‌గ‌జ వ‌ణికి పారిపోయింది.అడ‌విలో అస‌లు చిరుతకు కనికరంలేని వేటగాడ‌నే పేరుందంటే దాని ప్ర‌భావం ఎంత‌లా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే రీసెంట్‌గా చిరుతపులి అడ‌విలో వేటాడిన వీడియో ఒక‌టి నెట్టింట్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.ఇక అడవిలో ఎప్పుడు ఎలా వేట‌లు ఉంటాయో ఎవ‌రికీ తెలియ‌దు.

ఎందుకంటే అంత‌సేపు నిశ్శ‌బ్దంగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా ర‌ణ‌రంగంలా మారిపోతుంది.ఏ పొద చాటున ఏ పులి దాగి ఉంటుందో ఎవ‌ర‌కీ తెలియ‌దు.

ఇక ఇప్పుడు ఈ వీడియోలో చిరుతపులి ఒక కుందేలును త‌రిమి త‌రిమి వేటాడి చివ‌ర‌కు దాన్ని నోట‌క‌రుచుకుంది.హ‌మ్మ‌య్య ఇక ఈ పూట‌కు క‌డుపునిండా తినొచ్చు అని అనుకుందో లేదో అంత‌లోనే కుందేలుకు అదృష్టం క‌లిసి వ‌చ్చింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇక త‌న ప‌ని అయిపోయింద‌నుకున్న స‌మ‌యంలో ఓ అడవి పంది మెరుపు వేగంతో వచ్చి చిరుత‌ను త‌రిమి కొట్టి మ‌రీ కుందేలును ర‌క్షించిందంటే నిజంగా ఆశ్చ‌ర్య‌మే క‌లిగిస్తోంది.సాధార‌ణంగా అడ‌వి పందుల‌నే చిరుత‌లు వేటాడిన ఎన్నో వీడియోల‌ను మ‌నం చూశాం.కానీ ఒకే ఒక్క అడ‌వి పంది వ‌చ్చి ఏకంగా చిరుత‌ను గ‌జ‌గ‌జ వ‌ణికిస్తూ త‌రిమి కొట్టిందంటే ఇది నిజంగా మ‌న‌ల్ని న‌మ్మ‌లేని విధంగా చేస్తోంది.

Advertisement

అడ‌వి పంది భ‌యానికి చిరుత ఆ కుందేల‌ను అక్క‌డే వ‌దిలేసి ఒక‌టే లంకె అందుకుంది.ఇదంతా అక్క‌డున్న వారు జీపుల్లో నిల్చుని వీడియో తీసి పెట్ట‌డంతో నెట్టింట్ విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

తాజా వార్తలు