రాజస్థాన్ లో కాంగ్రెస్ సంక్షోభంపై అధిష్టానం అసంతృప్తి

రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో.సీఎం అశోక్ గెహ్లాట్ పై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కావాలనే సంక్షోభం సృష్టించారని సోనియా గాంధీ భావిస్తున్నట్లు సమాచారం.ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో సంక్షేమం చెలరేగడంపై అధిష్టానం అసంతృప్తిగా ఉంది.

సిడబ్ల్యుసి సభ్యులు సైతం గెహ్లాట్ తీరును తప్పుపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే గెహ్లాట్ పై సోనియాకు సిడబ్ల్యుసి సభ్యులు ఫిర్యాదు చేశారు.

అధ్యక్ష అభ్యర్థిగా గెహ్లాటను నమ్మటం మంచిది కాదని నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది.అంతే కాకుండా గెహ్లాట్ స్థానంలో మరొక అభ్యర్థని ప్రకటించాలని కోరుతున్నారు.

Advertisement

దీంతో అధ్యక్ష అభ్యర్థి రేసులో తెరపైకి కొత్త పేర్లు వచ్చాయి.కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్ని పేర్లు ప్రస్తుతం తెరమీదకు రాగా వీరిలో కమలనాథ్ కు ఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానం అందినట్లు సమాచారం.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు